Christmas 2023 : యేసు క్రీస్తు నుంచి చిన్నారులు నేర్చుకోవాల్సిన విషయాలివే!

యేసుక్రీస్తు జీవితం నుంచి పిల్లలు నేర్చుకోగలిగే ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. ప్రేమ,క్షమ గుణం, ఇతరులకు సహాయం చేయడం, ఔదార్యం, ఓర్పు, అహింస, నిజాయితీ , చిత్తశుద్ధి, ఇతరులను గౌరవించడం లాంటి ఎన్నో మంచి విషయాలను నేర్చుకోవచ్చు.

New Update
Christmas 2023 : యేసు క్రీస్తు నుంచి చిన్నారులు నేర్చుకోవాల్సిన విషయాలివే!

Dec 25, 2023 : రేపే(డిసెంబర్‌ 25) క్రిస్మస్‌(Christmas). పండగులు వస్తే హాలీడేస్‌ వస్తాయి. అందుకే ఫెస్టివల్స్‌(Festivals) అంటే పిల్లలకు చాలా ఇష్టం. ఏ రోజుల పండగ ఉందా అని క్యాలెండర్‌ను పదేపదే చూడడం స్కూల్‌ పిల్లలకు అలవాటు. ఫెల్టివల్స్‌కు ఎలాగో సెలవు వస్తుంది కదా.. ఆ రోజు ఎలాగో ఎంజాయ్‌ చేస్తారు. అయితే ఎంజాయ్‌మెంట్‌తో పాటు పండగుల నుంచి పిల్లలు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా దేవుడి నుంచి నేర్చుకోవాల్సిన క్వాలిటిస్‌ ఉంటాయి. కేవలం పూజలకు, ప్రార్థనలకే పండగులు పరిమితం కాకూడదు. ఈ క్రిస్మస్‌ సందర్భంగా యేసు క్రీస్తు గురించి ఏం నేర్చుకోవచ్చో తెలుసుకోండి.

ఈ విషయాలను తెలుసుకోండి:
యేసు ప్రేమ ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఇతరులతో దయ, సానుభూతితో వ్యవహరించడానికి పిల్లలకు నేర్పించాడు. యేసు తనకు అన్యాయం చేసిన వారిని క్షమించాడు. అంటే పిల్లలు కూడా పగలు, ప్రతీకారాలు కాకుండా క్షమించే గుణాన్ని అలవర్చుకోవాలి. క్షమించమని పిల్లలకు బోధించడం వారి మానసిక శ్రేయస్సుకు, ఆరోగ్యకరమైన సంబంధాలను ప్రోత్సహిస్తుంది. యేసు ఇతరులకు సేవ చేయడం ద్వారా, తన శిష్యుల పాదాలను కడగడం ద్వారా వినయాన్ని ప్రదర్శించాడు. ఇది పిల్లలకు వినయం విలువను నేర్పుతుంది. పిల్లలు ఇతరకు సహాయం చేయడం నేర్చుకోవాలి.

దాతృత్వం గురించి పిల్లలకు బోధించడం ముఖ్యం. కృతజ్ఞత భావాన్ని పెంపొందించేలా చేయాలి. యేసు ఇతరులతో తన పరస్పర చర్యలలో సహనాన్ని ప్రదర్శించాడు. దీని నుంచి పిల్లలు ఓపికగా ఉండటం నేర్చుకోవచ్చు. యేసు అహింసను భోదించాడు. శాంతియుతే సంఘర్షణలకు పరిష్కారం. సామరస్యాన్ని ప్రోత్సహించడం పిల్లలకు నేర్పించడం విలువైన పాఠం. పిల్లలు తమ పనులు, మాటలలో నిజాయితీ విలువను తెలుసుకోవచ్చు. యేసు అన్ని వర్గాల ప్రజలను గౌరవించాడు. ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడడం పిల్లలకు నేర్పడం సామరస్య సమాజాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ విలువలను పిల్లల జీవితాల్లో చేర్చడం ద్వారా, వారికి బలమైన నైతిక పునాది ఉంటుంది.

Also Read: అంతా తూచ్‌.. పాండ్యా వస్తున్నాడట.. ఇదెక్కడి లొల్లి భయ్యా!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు