Putin: ప్రియురాలిని 111 సార్లు కత్తితో పొడిచిన హంతకుడు.. క్షమాభిక్ష పెట్టిన పుతిన్..

రష్యాలో తన మజీ ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ఆమెను అత్యాచారం చేసి 111 సార్లు కత్తితో పొడిచిన హంతకుడికి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టారు. అలాగే అతడ్ని సైనికుడిగా ఉక్రెయిన్ సరిహద్దుకు పంపించారు. బాధితురాలు తల్లి హంతకుడ్ని అలా వదిలేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

New Update
Putin: ప్రియురాలిని 111 సార్లు కత్తితో పొడిచిన హంతకుడు.. క్షమాభిక్ష పెట్టిన పుతిన్..

రష్యాలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలిని వందసార్లకు పైగా పొడిచి హత్య చేసిన ఓ క్రూరుడికి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టారు. అంతేకాదు అతడ్ని సైనికుడిగా ఉక్రెయిన్ సరిహద్దుకు పంపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. వ్లాదిస్లావ్‌ కాన్యుస్‌ అనే వ్యక్తి తన మాజీ ప్రియురాలు వెరా పెక్తెలేవా బ్రేకప్ చెప్పిందన్న కోపంతో ఆమెను అత్యాచారం చేశాడు. ఆ తర్వాత 111 సార్లు కత్తితో పొడిచి.. మూడున్నర గంటల పాటు ఆమెను చిత్రహింసలు పెట్టి కిరాతకంగా హత్య చేశాడు. అయితే కాన్యూస్‌కు 17 ఏళ్లు జైలు శిక్ష పడింది. అయితే శిక్ష పడి ఏడాది పూర్తికాకుండానే ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ కాన్యూస్‌కు క్షమాబిక్ష పెట్టి వదిలేయడం అప్పుడు చర్చనీయాంశమవుతోంది.

Also read: అయోధ్యలో సరికొత్త రికార్డు.. ఒకేసారి 22.23 లక్షల దీపాల వెలుగులు..

ఉక్రెయిన్‌పై దాడులు చేసేందుకు రష్యా ప్రభుత్వం సైనిక సమీకరణలు చేపడుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే పలువురు ఖైదీలనూ విడుదల చేస్తూ.. యుద్ధక్షేత్రానికి తరలిస్తోంది. ఈ క్రమంలోనే పుతిన్‌ కాన్యూస్‌కు కూడా క్షమాభిక్ష పెట్టాడు. అయితే మృతురాలి తల్లి ఒక్సానా.. సైనిక దుస్తులలో ఆయుధం చేతపట్టి ఉన్న హంతకుడు కాన్యుస్‌ ఫొటోలను చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. తన కూతురును కిరాతకంగా హత్య చేసిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టి జైలు నుంచి వదిలేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అంతటి కిరాతకుడికి ఆయుధం ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమని, తన కూతురు ఆత్మకు శాంతి చేకూరదంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆ హంతకుడు బయట ఉంటే తమను కూడా చంపేస్తాడని ఆందళన వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు