Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉన్నత స్థాయి సంస్థలతో దర్యాప్తు చేయించాలి-ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ

రాజ్యాంగ విరుద్ధమైన ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచే నాయకులను తగిన విధంగా శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ అనాలిసస్‌ కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉన్నత స్థాయి సంస్థలతో దర్యాప్తు చేయించాలి-ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ

తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల నుంచి చంద్రశేఖర రావు ముఖ్యమంత్రిగా ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని రాష్ట్రాన్ని దోచుకోవడానికి హిట్లర్ లాంటి నిరంకుశ పాలకుడుగా నిరంతరం కల్వకుంట్ల వంశపారంపర్య రాజరికాన్ని నిర్మాణం చేయడం కొరకు ఒక కుట్ర పూరితంగా ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణం అని ప్రజలలో ఆందోళన వెల్లువెత్తుతున్నది. కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కులానికి సంబంధించిన అనేకమంది విశ్రాంత పోలీసు అధికారులను సర్వీసులో ఉన్న పోలీసు అధికారులను ఈ ఫోన్ ట్యాపింగ్‌లో కీలకపాత్ర పోషించడానికి నామినేటెడ్ పదవులు ఇచ్చి కొంతమందికి ప్రమోషన్లు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ ఏర్పాట్లు చేశారని ఇటీవలి వెలివడుతున్న ఉదంతాలు తెలియజేస్తున్నాయి.

తన బంధు వర్గానికి సంబంధించిన అధికారులను 30-40 మందిని ఈ కుట్ర వ్యవహారంలో బాధ్యతలు ఇచ్చి రాజకీయ నాయకుల, కార్పొరేట్ సంస్థల యజమానులను, బంగారు షాపుల యజమానులను రియల్ ఎస్టేట్ కార్పొరేట్ వ్యాపారస్తులను, బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయల ధనం, వేల ఎకరాల భూమిని సొంతం చేసుకున్నారని ఇటీవల మీడియా ద్వారా తెలుస్తున్నదని పౌర సమాజం పక్షాన ప్రముఖ సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ అభిప్రాయపడ్డారు.

ఈ వ్యవహారంలో ముఖ్య పాత్ర పోషించిన అధికారులు కూడా బడా వ్యాపారస్తులను కార్పొరేట్ సంస్థలను ప్రజలను వేధింపులకు గురి చేసి కల్వకుంట్ల కుటుంబంతోపాటు వీరు కూడా ధనము అస్తులను సొంతం చేసుకున్నట్లుగా అనేక కథనాలు వెలబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ మారక ద్రవ్యము కొనుగోలు చేయకుండా , హవాలా మార్గంలో 300 కోట్ల రూపాయలు చెల్లించి ఇజ్రాయిల్ నుంచి ఫోన్ టాపింగ్ ఎక్విప్మెంట్ తెప్పించి ప్రతిపక్ష నాయకుల పారిశ్రామికవేత్తల వ్యాపారస్తుల ఇంకా ఉన్నత స్థాయి అధికారుల, ప్రశ్నించే మేధావుల, ప్రజాస్వామ్య వాదుల మొబైల్ ఫోన్లను టాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడినట్లుగా మీడియా ద్వారా తెలుస్తున్నది.

ఈ వ్యవహారంలో వందల కోట్ల రూపాయల హవాలా లావాదేవీలు జరగడమే కాకుండా మొత్తం రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ లేకుండా ఒకే పార్టీ, ఒకే కుటుంబం, ఒకే కులం అధికారం రాజరికం కొనసాగాలని చేసిన కుట్రగా ప్రజలు భావిస్తున్నారు. అంతేకాకుండా కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఇజ్రాయిల్ మిషనరీని తెప్పించుకోవడం మనీ ల్యాండరింగ్ కింద తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని పుల్లూరు సుధాకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి దేశాన్ని అంతటిని తన నిరంకుశ పాలన క్రిందికి తీసుకురావడానికి దేశద్రోహం చేసే కుట్రను అమలు చేసినట్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ద్వారా తెలుస్తున్నది.

దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలకు కావలసినంత డబ్బు ఇచ్చి అధికారాన్ని కైవసం చేసుకోవాలని కూడా ఒక ప్రముఖ పాత్రికేయునికి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన మనోగతాన్ని వెల్లడించినట్లుగా మీడియా కోడై కోసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాధారణమైన క్రిమినల్ యాక్టివిటే కాకుండా దీనిని అనేక కోణాల నుంచి దర్యాప్తు చేసి పరిశీలించవలసిన అవసరం ఉన్నదని తెలంగాణ ప్రజలు, మేదావులు భావిస్తున్నారని ప్రముఖ సామాజికవేత్త బొమ్మినేని పాపిరెడ్డి అన్నారు.

అనేకమంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన పోలీస్ అధికారులు ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో చట్ట విరుద్ధంగా ప్రజా వ్యతిరేక దేశ ద్రోహ కుట్రలకు పాల్పడ్డారు కాబట్టి ఇందులో కుటుంబ సభ్యులతోపాటు కులానికి సంబంధించిన అనేక మంది రాజకీయ నాయకులు అదే కులానికి సంబంధించిన అనేకమంది పోలీసు అధికారులు, విశ్రాంత అధికారులు తమ పాత్ర పోషించినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి.

ఫోన్ టాపింగ్ తో పాటు ఇందులో మనీ లాండరింగ్ అనేక వ్యాపారస్తుల, సంస్థల ఆస్తులను కొల్లగొట్టినట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ దర్యాప్తు కేవలం తెలంగాణ అధికారులు నిర్వహించడం వలన వాస్తవాలు కొంత కప్పిపుచ్చడానికి అవకాశం ఉండవచ్చు. అనేకమంది ధనవంతులైన రాజకీయ పలుకుబడి కలిగిన ఒకే కులానికి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో భాగస్వాములైనట్టుగా సోషల్ మీడియా ద్వారా పౌర సమాజానికి తెలుస్తున్నది.
దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా నిక్సన్ వాటర్ గేట్ కుట్ర కేసుకుంటే ఎన్నో రేట్లు దుర్మార్గమైందని దేశ వ్యతిరేకమైన సంఘటన అని రాజకీయ విశ్లేషకులు సోమరాంబమూర్తి అభిప్రాయపడ్డారు.

రాజకీయాలకతీతంగా ఈ దర్యాప్తు ఇతర రాష్ట్రాల లేదా కేంద్ర అధికారులు సుప్రీంకోర్టు సిట్టింగ్, రిటైర్డ్ న్యాయమూర్తుల ద్వారా నిర్వహించినట్లయితే వాస్తవాలు బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి దేశద్రోహ, కుట్రపూరిత చర్యలు మరి ముందు కాలంలో ఏ పార్టీ కూడా చేపట్టకుండా ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వాములైన అధికారులను అనధికారులను తగిన విధంగా శిక్షించడానికి చర్యలు చేపట్టకపోతే తెలంగాణ ప్రజలే కాదు యావత్ భారత ప్రజలు కూడా క్షమించరు. ఇంతకు పూర్వము తెలంగాణ ప్రభుత్వంలో అనేక స్పెషల్ ఇన్విస్ట్రిగేషన్ టీముల ద్వారా జరిగిన దర్యాప్తులు వాటి నిజనిర్ధారణ రిపోర్టులు ఇంతవరకు వెలుగు చూడలేదు. అందుకే ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దర్యాప్తును ఇంకా ఉన్నత స్థాయి సంస్థలతో శీఘ్ర గతిన నిర్వహించడం వలన వాస్తవాలు నిష్పక్షపాతంగా బయటికి రావడానికి , దోషులను తగిన విధంగా శిక్షించడానికి వీలవుతుంది.

ఈ కుట్రతో రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చి, ఈ రాష్ట్ర వనరులన్నీ దోపిడీ చేసుకొని దేశంలోనే ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పన్నిన కుట్రగా భావించాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారాన్ని ఆశామాషిగా కాకుండా సరైన నిర్ణయం తీసుకొని ఉన్నత స్థాయి దర్యాప్తులు చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ దుర్మార్గమైన, దురదృష్టకరమైన సంఘటన ద్వారా రాష్ట్ర ప్రజలంతా సివిల్ సొసైటీ మేధావులు ఆందోళన చెందుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. రాజ్యాంగ విరుద్ధమైన ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచే నాయకులను, వారి అడుగులకు మడుగులొత్తిన అధికారులను తగిన విధంగా శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు,సామాజిక కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈరోజు తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మరో సభ్యులు
సతీష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.

ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ

Advertisment
Advertisment
తాజా కథనాలు