Dil Raju : ఎట్టకేలకు బాలయ్యతో సినిమా చేయనున్న దిల్ రాజు.. డైరెక్టర్ ఎవరంటే?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలయ్యతో ఒక భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ యంగ్ డైరెక్టర్ బాలయ్యకు కథ వినిపించగా.. అది ఆయనకు నచ్చిందని, దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నట్టు టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

New Update
Dil Raju : ఎట్టకేలకు బాలయ్యతో సినిమా చేయనున్న దిల్ రాజు.. డైరెక్టర్ ఎవరంటే?

Producer Dil Raju : టాలీవుడ్‌లో ప్రస్తుతం బాలకృష్ణ - దిల్‌రాజు కాంబినేషన్ లో సినిమా హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఈ కలయిక తెలుగు సినీ ప్రేమికులందరిలోనూ ఎంతగానో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దిల్‌రాజు ఇప్పటిదాకా బాలయ్యతో కలిసి సినిమా చేసిన దాఖలాలు లేవు. గతంలో చాలాసార్లు బాలయ్యతో సినిమా చేయడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. ఇక ఎట్టకేలకు ఇప్పుడు బాలయ్యతో ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

బాలయ్య ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. దిల్‌రాజు వంటి ప్రముఖ నిర్మాతతో కలిసి పని చేయడం బాలయ్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలువనుంది. దిల్‌రాజు కుటుంబ కథా చిత్రాలకు ప్రసిద్ధి. అలాంటి ఆయన బాలయ్య వంటి మాస్ హీరోతో కలిసి ఎలాంటి కథను ఎంచుకుంటారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Also Read : రాజమౌళి – మహేష్ మూవీపై RGV ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఊహలకే అందదంటూ..!

ఇటీవల ఓ యంగ్ డైరెక్టర్ బాలయ్యకు కథ వినిపించగా.. అది ఆయనకు నచ్చిందని, దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నట్టు టాక్ వినిపిస్తుంది. దీంతోఈ  కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. కథ ఏమిటి, దర్శకుడు ఎవరు వంటి విషయాలు తెలియాల్సి ఉంది. ఇక బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'NBK109' మూవీ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

New Update
HIT 3 new song

HIT 3 new song

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మూడో సాంగ్

ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment