/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Virat-9-jpg.webp)
వరల్డ్ కప్ 2023 ముగిసిపోయింది. మూడోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలన్న టీమిండియా ప్రయత్నాలు ఫలించలేకపోయాయి. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి చివరికి ఫైనల్లో టీమిండియా ఓడిపోవడంతో కోట్లాది మంది క్రికెట్ అభిమానుల గండెలు ఆవేదనతో బరువెక్కాయి. ఈసారి కచ్చితంగా కప్ మనదే అన్న కల చెదిరిపోయింది. ఇక మరో ప్రపంచ కప్ రావాలంటే ఇంకా నాలుగు సంవత్సరాల పాటు వేచిచూడాల్సిందే. అయితే ప్రస్తుతం భారత జట్టులో ఉన్న కొంతమంది కీలక ఆటగాళ్లు తమ చివరి వరల్డ్ కప్‌కు గుడ్‌బై చేశారనే చెప్పుకోవచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ 2027 ప్రపంచకప్‌లో ఆడటం అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పటికే 36 ఏళ్ల వయసున్న రోహిత్ ఫిట్‌నెస్ సమస్యల వల్ల ఇబ్బందులు పడుతూ అన్ని మ్యాచ్‌లు ఆడటం లేదు. ఇక 2027 అంటే అతనికి 40 ఏళ్ల వయసొస్తుంది. ఇక ఆ టైమ్ లో వరల్డ్ కప్ ఆడటం అంటే చాలా కష్టం.
Also Read: దేన్నీ సాకులుగా చూపించాలని అనుకోవడం లేదు..రోహిత్ శర్మ
మరోవైపు బౌలింగ్‌తో రెచ్చిపోయే పేసర్ మహమ్మద్ షమికి ప్రస్తుతం 33 ఏళ్లు. ప్రస్తుతం ప్రత్యర్థులు వికేట్లు పడగొడుతూ జోష్‌లో ఉన్న షమీ 2027 నాటికి 37 ఏళ్ల వయసుకు చేరుకుంటారు. ఆ వయసులో అతను టీమిండియాలో ఉండే అవకాశం చాలా తక్కువ. అలాగే 37 ఏళ్ల అశ్విన్, 34 ఏళ్ల జడేజా కూడా వచ్చే వరల్డ్‌కప్‌కు జట్టులో ఉండరనే చెప్పాలి. ఇక ప్రస్తుతం 36 ఏళ్ల వయసున్న స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కొహ్లీ ఫిట్‌నెస్‌లో మేటి అని చెప్పుకోవచ్చు. వచ్చే వరల్డ్‌కప్‌కి అతనికి 39 ఏళ్లు వస్తాయి. మరి అప్పుడు విరాట్ ఆడగలడా లేదా అనేది కూడా సందేహించాల్సిన విషయమే. ఇక మిగతా టీమ్‌లైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లలో కూడా మరికొంత మంది ఆటగాళ్లు వచ్చే వరల్డ్ కప్‌కు ఉండకపోవచ్చు.
Also read: ఆటగాళ్ల భావోద్వేగం: కెప్టెన్ రోహిత్ శర్మ, మహ్మద్ సిరాజ్ కంటతడి