Priyanka gandhi: తెలంగాణ లో ప్రియాంక ఎన్నికల ప్రచారం..షెడ్యూల్ ఏంటంటే! తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు రోజులే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్ని కూడా జోరు పెంచాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. By Bhavana 24 Nov 2023 in నేషనల్ తెలంగాణ New Update షేర్ చేయండి మరో నాలుగు రోజుల్లో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. దీంతో ప్రధాన పార్టీల నేతలు ఢిల్లీ నుంచి తమకు మద్దతుగా నేతలను బరిలోకి దింపుతున్నాయి. వారు కూడా ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా తెలంగాణలో తమ జెండా పాతలని చూస్తున్న కాంగ్రెస్..తమ ప్రధాన నేతల్లో ఒకరు అయినటువంటి ప్రియాంక గాంధీని రాష్ట్రానికి రప్పిస్తుంది. ప్రియాంక గాంధీ రాష్ట్రంలో రెండు రోజులు పాటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేసేందుకు రాష్ట్రానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రియాంక నేటి నుంచి ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రియాంక షెడ్యూల్ ఖరారైంది. ఆమె 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు పాలకుర్తిలో జరిగే సమావేశానికి ప్రియాంక హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు హుస్నాబాద్, సాయంత్రం 4 గంటలకు ధర్మపురిలో జరిగే సభలో ఆమె ప్రసంగిస్తారు. శనివారం ఆమె పాలేరు, ఖమ్మం, వైరా, మదిర నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. కొత్తగూడెంలో ప్రియాంక గాంధీ రోడ్ షోలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చి, బలపరిచిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయాన్ని కోరుతూ ఆమె తో పాటు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా కూడా రోడ్ షో , ప్రజా భేరిలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రియాంక శుక్రవారం రాత్రి ఖమ్మంలో బస చేస్తారు. కాగా హూస్నాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ మీడియా కరీంనగర్ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ రోహిత్ రావు, ఏఐసీసీ కరీంనగర్ పార్లమెంట్ పరిశీలకులు ఖిట్టాభర్ తిలక్ మాట్లాడారు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్ని సర్వేలు చెబుతున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ ప్రచార సభలో ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తరువాత ఆయన బహిరంగ సభ ఏర్పాటు చేసే స్థలాన్ని, ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. Also read: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ కు షాక్..పార్టీని విడనున్న మరో ఎమ్మెల్యే #congress #telangana #khammam #telangana-elections-2023 #priyanka-gandhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి