Priyanka Gandhi: ప్రియాంక ప్రకంపనలు..అది జరిగితే సంచలనమే..!

ప్రియాంక వయనాడ్ నుంచి పోటీ చేసినట్టు ప్రకటించగానే కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆమెను ఇందిరాతో పోల్చడం మొదలుపెట్టారు. మాజీ ప్రధాని, నాయనమ్మ ఇందిరాగాంధీతో ప్రియాంకకు చాలా పోలికలు ఉన్నాయని కాంగ్రెస్‌ అభిమానులు మురిసిపోతున్నారు.

New Update
Priyanka Gandhi: ప్రియాంక ప్రకంపనలు..అది జరిగితే సంచలనమే..!

Priyanka Gandhi: అది జనవరి 11, 1998. సోనియా గాంధీ (Sonia Gandhi) రాజకీయ రంగప్రవేశం చేసిన రోజు. అంతకముందు సరిగ్గా ఏడేళ్ల క్రితం తన భర్త రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) హత్యకు గురయ్యారు. రాజీవ్‌ చనిపోయిన తమిళనాడు-శ్రీపెరంబుదూర్‌ నుంచే సోనియా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ఈ ర్యాలీలో అందరిచూపు సోనియాపై ఉండాలి కానీ.. అక్కడున్నవారంతా సోనియా కంటే ఎక్కువగా ఒక 26ఏళ్ల అమ్మాయిపైనే చూపు పెట్టారు. ఆమెనే సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ.

ఎరుపు చీరలో కనిపించిన ప్రియాంక నాటి సభలో తమిళంలో కేవలం ఒక లైన్ మాత్రమే మాట్లాడారు. 'ఎల్లూరు కాంగ్రెస్‌కు ఓటు పొదుంగల్' అని ప్రియాంక అక్కడి ప్రజల్ని ఉర్రూతలూగించారు. దీని అర్థం 'మీరంతా కాంగ్రెస్‌కే ఓటు వేయండి' అని..! దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా 'అవర్‌ ఫ్యూచర్‌ లీడర్‌.. అవర్‌ ఫ్యూచర్‌ లీడర్‌' అని నినాదాలు చేశారు. అయితే ఇది నిజమవడానికి ఆ తర్వాత 26ఏళ్లు పట్టింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక ఎంట్రీ ఇవ్వడం కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ను నింపింది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) రెండిటిలోనూ విజయం సాధించారు. గాంధీ కుటుంబం కంచుకోట రాయ్‌బరేలీతో పాటు కేరళలోని వయానడ్‌ నుంచి రాహుల్‌ పోటి చేశారు. రెండు స్థానాల్లోనూ గెలవడంతో వయానడ్‌ సీటును వదులుకున్నారు. దీంతో ఆ స్థానం నుంచి ప్రియాంక పోటి చేయనుంది. 52వ ఏట ప్రియాంక గాంధీ నేరుగా రాజకీయ బరిలోకి దిగుతుండడం విశేషం. అది కూడా దక్షిణాది నుంచి ఆమె పోటి చేస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రియాంక వయనాడ్ (Wayanad) నుంచి పోటీ చేసినట్టు ప్రకటించగానే కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆమెను ఇందిరాతో పోల్చడం మొదలుపెట్టారు. మాజీ ప్రధాని, నాయనమ్మ ఇందిరాగాంధీతో ప్రియాంకకు చాలా పోలికలు ఉన్నాయని కాంగ్రెస్‌ అభిమానులు మురిసిపోతున్నారు. ప్రియాంక గాంధీకు ఆమె నాయనమ్మ ఇందిరతో చాలా సారూప్యతలు ఉన్నాయి. అంటే సోషల్‌మీడియాలో ఎక్కువగా వినిపించే, కనిపించే ముక్కు, ముఖం గురించి పోలికలు కాదండోయ్. పనితీరు, జీవనశైలిలోనూ ప్రియాంకకు ఇందిరాతో దగ్గర పోలికలున్నాయట!

ఇందిరా గాంధీని 1952 ఎన్నికలలో పోటి చేయాలని నాటి కాంగ్రెస్‌ పార్టీ కోరింది. అయితే తన బిడ్డలు రాజీవ్, సంజయ్ చాలా చిన్న వారు కావడంతో ఇందిరా ఆ పని చేయలేదు. ప్రియాంక కూడా తన పిల్లలు రైహాన్, మిరాయా కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే దశాబ్దాల తరువాత, నాన్నమ్మ అడుగుజాడలను ప్రియాంక అనుసరించారు. ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకున్నా ఇందిరా లాగే కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు. ప్రియాంక 2004, 2009 లోక్‌సభ ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని UPA కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.

1984 అక్టోబర్‌లో ఇందిరా మరణానికి కేవలం రెండు రోజుల ముందు సోనియా మాట్లాడిన మాటలను 'ది చినార్ లీవ్స్' పుస్తకంలో ML ఫోతేదార్ రాసుకొచ్చారు. భవిష్యత్‌లో ప్రియాంక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలనే కోరికను ఫోతేదార్‌తో ప్రస్తావించారు. ఇక 2004లో సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ అమేథి నుంచి పోటి చేయాలని రాహుల్ గాంధీకి చెప్పింది. దీంతో ప్రియాంక వెనక్కి తగ్గారు. అయితే ప్రత్యక్షంగా ప్రియాంక రాజకీయాల్లో లేకున్నా కాంగ్రెస్‌కు మాత్రం ట్రబుల్‌ షూటర్‌గా పనిచేశారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో సంక్షోభాలను తొలగించడంలో ప్రియాంక కీలక పాత్ర పోషించారు.

1967 ఎన్నికలలో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించిన ఇందిరా... ప్రత్యక్ష ఎన్నికల రంగంలోకి దూసుకెళ్లారు. 1952లో పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వాల్సిన ఇందిరా 15ఏళ్ల తర్వాత నేరుగా బరిలోకి దిగారు. అదే విధంగా, 1998లో సోనియా గాంధీ రాజకీయ అరంగేట్రం అప్పుడే ప్రియాంక కూడా వస్తారని అంతా భావించారు. అయితే ఇందిరా లాగానే చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎన్నికల రణరంగంలోకి నేరుగా దూకారు. ఇలా చాలా విషయాల్లో నానమ్మ ప్రియాంకతో ఇందిరాకు పోలికలు ఉన్నాయని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు!

Also read: అధికారులపై పవన్ సీరియస్.. నిధుల మళ్లింపుపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశం..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump: రష్యాతో క్రిమియా...ట్రంప్‌!

క్రిమియా రష్యాతోనే ఉంటుందని ట్రంప్ అన్నారు.ఆ ప్రాంతం రష్యాతో ఉన్నవిషయాన్ని జెలెన్‌ స్కీ సహా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు.జెలెన్‌ స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారని ఆరోపించారు.

New Update
Trump

Trump

ఉక్రెయిన్‌ -రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని ఆకాంక్షిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ..ఆ రెండు దేశాలు చర్చలు జరిపేలా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదే సమయంలో ఓ ఇంటర్వ్యూఓ కీలక వ్యాఖ్యలు చేశారు.క్రిమియా రష్యాతోనే ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read: Marriage News: ఎవడ్రా వీడు.. ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు- వీడియో చూశారా?

''క్రిమియాలో అత్యధికంగా రష్యన్‌ భాష మాట్లాడే వారే ఉన్నారు.ఎంతో కాలంగా సబ్‌ మెరైన్లను రష్యా అక్కడ ఉంచింది. ఒబామా హయాంలోనే ఇదంతా జరిగింది. ఆ ప్రాంతం రష్యాతో ఉన్నవిషయాన్ని జెలెన్‌ స్కీ సహా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు అని టైమ్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ పేర్కొన్నారు.

Also Read: Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో చర్చలను అడ్డుకుంటూ జెలెన్‌ స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారని ఆరోపించారు. దక్షిణ ఉక్రెయిన్ లో నల్ల సముద్రం వెంబడి ఉన్న క్రిమియా వ్యూహాత్మక ప్రాంతం.2014 లో రష్యా దానిని స్వాధీనం చేసుకుంది. తాజాగా ఇదే అంశం పై మాట్లాడిన ట్రంప్‌ ..క్రిమియా రష్యాతోనే ఉంటుందని చెప్పారు.

అయితే ఉక్రెయిన్‌ పై రష్యా భీకర దాడులకు పాల్పడుతుండటం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన..ఇది సరైన సమయం కాదన్నారు.వారానికి ఐదు వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని , ఇప్పటికైనా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని పుతిన్‌కు సూచించారు.

మరో వైపు యుద్ధం ముగింపు కోసం చర్చలు జరిపేందుకు ట్రంప్‌ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌ మాస్కోకు వెళ్లారు. పుతిన్‌ తో ఆయన భేటీ అయ్యే అవకాశాలున్నాయి.ఈ పరిణామాల పై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ స్పందిస్తూ ..యుద్ధానికి ముగింపు పలికేలా అమెరికాతో ఒప్పందం చేసుకోవడానికి మాస్కో సిద్ధంగా ఉందన్నారు.

కొన్ని అంశాలు పరిష్కరాం కావాల్సి ఉందన్న ఆయన...అమెరికా అధ్యక్షుడు సరైన మార్గంలో ఆలోచించడం వల్లే ప్రస్తుతం ఈ చర్చలు సరైన దిశలో ముందుకెళ్తున్నాయని చెప్పారు.

Also Read: Realme 14T 5G: రియల్‌మి నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్.. సేల్ షురూ - ధర, ఆఫర్ల వివరాలివే!

Also Read: BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని

trump | russia | putin | ukrain | zelensky | putin vs zelensky | ukraine-zelenskyy | zelensky vs putin | america | latest-news | telugu-news 

Advertisment
Advertisment
Advertisment