డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన ప్రియాంక.. ఏమన్నారంటే

సోషల్ మీడియాలో వైరల్ అయిన డీప్ ఫేక్ వీడియోపై ప్రియాంక చోప్రా స్పందించింది. నేను ఏ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయలేదు. నా వాయిస్‌ని మార్చేసి, నేనే చెబుతున్నట్టు తయారు చేసి వీడియోను ఎవరూ నమ్మొద్దు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఆమె కోరారు.

New Update
డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన ప్రియాంక.. ఏమన్నారంటే

Priyanka Reacted On Deepfake : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)ఇటీవల తనకు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అయిన ఇష్యూపై స్పందించింది. నిజానికి తాను ఎలాంటి బ్రాండ్ ప్రమోట్ చేయలేదని, ఆకతాయిలు అమ్మాయిల జీవితంతో ఎందుకిలా ఆడుకుంటున్నారో తనకు అర్థం కావట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఇలాంటి వాటిని ఎవరూ గుడ్డిగా నమ్మొద్దని, గవర్నమెంట్ కూడా ఈ దుర్మార్గపు చర్యను సీరియస్ గా తీసుకోవాలని కోరింది.

publive-image

Also read :ఏపీలో వాగుదాటబోయి ముగ్గురు గల్లంతు.. వీడియో వైరల్

ఈ మేరకు ‘నేను ఏ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయలేదు. ఇది నిజంగా దారుణం. నా వీడియోలో వాయిస్‌ని మార్చేసి, నేనే చెబుతున్నట్టు తయారు చేసి విడుదల చేశారు. దయచేసి ఈ వీడియోను నమ్మొద్దు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. లేకపోతే ముందుముందు చాలా దారుణాలు చూడాల్సొస్తుంది’ అంటూ వాపోయింది ప్రియాంక. ఇక ప్రియాంక పాత వీడియోలో ఆమె వాయిస్‌ మాత్రం మార్చేసి, తాను ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు లిప్‌సింక్‌ చేశారు. ఆ బ్రాండ్‌ వల్ల తన వార్షిక ఆదాయం బాగా పెరిగిందని, కాబట్టి అందరూ దాన్ని వాడాలని ప్రియాంక చెబుతున్నట్టు ఆ వీడియోను క్రియేట్‌ చేశారు. ఇదిలావుంటే.. ఇటీవల కాలంలో డీప్‌ ఫేక్‌ (Deepfake)వీడియోలు దేశానికే పెద్ద సమస్యగా మారాయి. సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకూ చాలామంది వీటి బారిన పడుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది. ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ వీటి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు