142 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్‌ అత్యాచారం.. ఆరేళ్లుగా అదే పని

ఆరు సంవత్సరాలుగా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించిన ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. 142 మంది విద్యార్థినులు అతను వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.

New Update
142 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్‌ అత్యాచారం.. ఆరేళ్లుగా అదే పని

స్కూల్ పిల్లలపై లైంగిక వేధింపుల ఘటనలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. బాత్ రూమ్ వెళ్లిన బాలికలను టార్గెట్ చేసుకుని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ఉపాధ్యాయులు. అంతేకాదు పసిపిల్లలకు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని అత్యాచారం చేస్తున్నారు. ఇలాంటి దారుణమైన మరో సంఘటన హరియాణాలో చోటుచేసుకుంది. ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా 142 మంది పాఠశాల విద్యార్థినులు సెక్స్ వల్ గా టార్చర్ చేసిన ఆ కామాంధుడు చివరికి కటకటాలపాలయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Also read : మనల్నెవడ్రా ఆపేదీ!: ప్రచారంలో దూసుకుపోతున్న బర్రెలక్క

హరనియాణాలోని జింద్‌ పోలీసుల వివరాల ప్రకారం.. జింద్ లోని ఓ గవర్నమెంట్ స్కూల్ లో దాదాపు 390 విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 15 మంది విద్యార్థినులు తమపై ప్రిన్సిపల్‌ చేస్తోన్న అఘాయిత్యాల గురించి వివరిస్తూ గత ఆగస్టు నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌లకు లేఖ రాశారు. సెప్టెంబర్‌లో హరియాణా మహిళా కమిషన్‌ వారి లేఖను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని జింద్‌ పోలీసులకు సూచించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా లైంగిక వేధింపులు వాస్తవమేనని తేలడంతో నవంబర్‌ 4న ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడానికి మొదట 60 మంది విద్యార్థినులు ముందుకొచ్చారని, ఇప్పుడు ఆ సంఖ్య 142కి చేరిందని మహిళా కమిషన్‌ పేర్కొంది. ప్రిన్సిపల్‌పై త్వరలో ఛార్జ్‌షీట్‌ తెరవనున్నట్లు పోలీసులు తెలిపారు. నవంబర్‌ 16న అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీస్‌ దీప్తి గార్గ్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేశామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. అలాగే మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు