Prakash Raj: నీ విమర్శలు రాజకీయ పార్టీ మీద చేసుకో..దేశం మీద కాదు!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ -3 గురించి సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ ఫోటోను షేర్‌ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పై నెటిజన్లు మండిపడుతున్నారు.

New Update
Prakash Raj: నీ విమర్శలు రాజకీయ పార్టీ మీద చేసుకో..దేశం మీద కాదు!

Prakash Raj Tweet: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ -3 (Chandrayaan-3)గురించి సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ ఫోటోను షేర్‌ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలేం పోస్ట్‌ ప్రకాష్‌ రాజ్‌ పోస్ట్‌ చేశారంటే....ఓ వ్యక్తి లుంగీలో టీ పోస్లున్నట్లు గా ఉంది.

ఈ ట్వీట్ కు ప్రకాష్‌ రాజ్‌ ఇలా రాసుకొచ్చారు. ‘బ్రేకింగ్ న్యూస్.. చంద్రుని నుండి వస్తున్న మొదటి చిత్రం #VikramLander వావ్’ అంటూ రాశారు. ఆయన షేర్‌ చేసిన ఫోటో ఛాయ్‌ వాలాను పోలి ఉండడంతో పాటు..ఆ పోస్ట్‌ దేశ ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)ని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టినట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు.


చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ప్రకాశ్ రాజ్ పోస్టు ఉండటంతో మండిపడుతున్నారు. చంద్రయాన్‌ 3 అనేది దేశానికి గర్వకారణం. కానీ, ప్రకాశ్ రాజ్ అతని గుడ్డి ద్వేషంకోసం శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఓ నెటిజన్‌ ఇలా రాశారు.. ప్రకాశ్ రాజ్.. చంద్రయాన్ మిషన్ ఇస్రో (ISRO) ప్రయోగించింది.. బీజేపీది కాదు. మీరు విమర్శించాలనుకుంటే ఇండియాను కాదు.. ఏదైనా పార్టీని విమర్శించుకోండి అంటూ సలహా ఇచ్చాడు.మరో పక్క బీజేపీ నేతలు సైతం ప్రకాశ్‌ రాజ్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ 3 మరి కొద్ది గంటల్లో చంద్రుని మీద అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉంది. చంద్రుని దక్షిణ ధ్రువం ఉపరితలం పై విక్రమ్‌ ల్యాండర్ అడుగిడనుంది.

ఈ ప్రక్రియ విజయవంతం అయితే ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ఈనెల 23న సాయంత్రం 6.04 గంటల సమయంలో చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ అడుగిడుతుందని ఇస్రో తెలిపింది.

రష్యా లూనా-25 (Russia's Luna-25) ప్రయోగం విఫలం కావడంతో.. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 వైపు చూస్తున్నాయి.

Also Read: మరోసారి కొత్త ఫొటోలు పంపిన చంద్రయాన్-3.. అబ్బురపరుస్తున్న పిక్స్..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు