PO Scheme for Women :మహిళల కోసం పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్.. రెండేళ్లలో అధిర రాబడి! పోస్టాఫీస్ మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ స్కీమ్ కింద రెండేళ్ల కాలానికి 7.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మొదటి ఏడాది రూ.15 వేలు, రెండో ఏడాది రూ.16,125 రాబడి వస్తుంది. ఈ పథకం కింద రెండేళ్లలో రూ.2 లక్షల పెట్టుబడిపై రూ.31,125 వడ్డీ లభిస్తుంది. By Archana 04 Mar 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Post Office Schemes: బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసు లు కూడా కస్టమర్ల కోసం కొత్త పెట్టుబడి పథకాలతో ముందుకొస్తున్నాయి. పోస్టాఫీస్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా సురక్షితంగా నిపుణులు చెబుతుంటారు. అలాగే పోస్టాఫీస్ స్కీమ్స్(Post Office Schemes) లో బెనిఫిట్స్ కూడా బెటర్‌గా ఉంటాయి. ఇక మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. మహిళలు రెండేళ్లలో మంచి రాబడి తెచ్చుకోవాలనుకుంటే ఓ పోస్టాఫీస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్(Invest) చేయొచ్చు. మహిళల కోసం 'మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ స్కీమ్'(Mahila Samman Certificate Scheme) ను ప్రభుత్వం అమలు చేస్తోంది. మీరు, మీ కుమార్తె లేదా భార్య లేదా మరెవరికైనా పెట్టుబడి ఎంపిక కోసం చూస్తున్నట్లయితే ఈ పోస్టాఫీస్ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. పన్ను మినహాయింపు: మహిళల గౌరవ ధృవీకరణ పత్రం పథకాన్ని పోస్టాఫీసు ద్వారా కూడా పొందవచ్చు. పోస్టాఫీస్ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మహిళలు ఎలాంటి మార్కెట్ రిస్క్‌ను ఎదుర్కోరు. మీకు రీఫండ్ లభిస్తుంది. ఈ స్కీమ్ కింద మహిళలు గరిష్టంగా రూ.2 లక్షల వరకు రెండేళ్ల పాటు డిపాజిట్ చేయవచ్చు. రెండేళ్లలో పెట్టుబడిపై 7.5 శాతం ఫిక్స్‌డ్ వడ్డీ రేటు లభిస్తుంది. ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలు పొదుపు చేయడం ద్వారా స్వయం సమృద్ధి సాధించవచ్చు. ఈ పథకంలో జమ చేసే డబ్బుపై ప్రభుత్వం పన్ను మినహాయింపు కూడా ఇస్తోంది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మహిళలందరికీ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకం కింద, 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న బాలికలు తమ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. ఎంత ఆదాయం వస్తుంది? మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ స్కీమ్ కింద రెండేళ్ల కాలానికి 7.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మొదటి ఏడాది రూ.15 వేలు, రెండో ఏడాది రూ.16,125 రాబడి వస్తుంది. అంటే ఈ పథకం కింద రెండేళ్లలో రూ.2 లక్షల పెట్టుబడిపై రూ.31,125 వడ్డీ ఆదాయం లభిస్తుంది. నిబంధనల ప్రకారం మహిళా సమ్మాన్ సచ్ష్ సర్టిఫికేట్ స్కీమ్‌లో ఒక సంవత్సరం పూర్తి చేసిన తర్వాత, మీరు పాక్షిక ఉపసంహరణకు అనుమతించబడతారు. మీరు డిపాజిట్(Deposit) చేసిన మొత్తంలో 40 శాతం ఉపసంహరించుకోవచ్చు. అంటే మీరు రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే ఏడాది తర్వాత రూ.80,000 విత్ డ్రా చేసుకోవచ్చు. ఏ వయసు మహిళలైనా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. మైనర్ బాలిక తల్లిదండ్రులు తమ పేరు మీద ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. Also Read : చైనా ఎలక్ట్రిక్ కార్లతో గూఢచర్యం చేస్తోంది.. అమెరికా ఆరోపణలు.. #investment #post-office-schemes #mahila-samman-certificate-scheme #deposit మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి