Medaram: మేడారం జాతరకు 6వేల ప్రత్యేక బస్సులు.. మంత్రి పొన్నం ప్రకటన

మేడారం జాతర ఏర్పట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఉచిత బస్సు పథకం వల్ల మేడారం జాతరకు వచ్చే భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇందుకోసం 6 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు.

New Update
Medaram: మేడారం జాతరకు 6వేల ప్రత్యేక బస్సులు.. మంత్రి పొన్నం ప్రకటన

Minister Ponnam Prabhakar: మేడారం (Medaram) సమ్మక్క సారక్క జాతర పై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హైదరాబాద్ (MCHRD)లో మంత్రుల సమీక్షా సమావేశం జరిగింది. సమీక్షా సమావేశంలొ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka), రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Sureka), సీఎస్ శాంతి కుమారి (Shanthi Kumari), డీజీపీ రవి గుప్తా (DGP Ravi Gupta) వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ALSO READ: కాంగ్రెస్ నేతలు జైళ్లలో.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

28 లోపు అన్ని పనులు పూర్తి అవుతాయి..

జిల్లా కలెక్టర్ అధికారులకు మేడారం జాతర పనులు త్వరితగతిన పూర్తికావడానికి అధికారులకు వర్క్ అసైన్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. 28 లోపు అన్ని పనులు పూర్తి అవుతాయని అన్నారు. గతంలో అక్కడ పని చేసిన అధికారులకు ట్రాఫిక్ జామ్ ,రూట్ క్లియారెన్స్ కోసం నోడల్ ఆఫీసర్ కి బాధ్యతలు అప్పగించారు.

కోట్లాది మంది భక్తులు వచ్చే జాతర లో ప్రధానంగా ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమ్మక్క సారక్క జాతర విజయవంతానికి అన్ని డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయం తో కలిసి పని చేయాలని అన్నారు.

ALSO READ: ధరణిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

6 వేల ప్రత్యేక బస్సులు..

మేడారం సమ్మక్క సారక్క జాతర కోటి 50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు అధికారులు. మహాలక్ష్మి పథకం ద్వారా భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈసారి 6 వేల బస్సులు నడిపించడానికి ఆర్టీసీ ప్రణాళికలు రచించిందని అన్నారు.

అదనంగా బస్సులు వేయడం వల్ల 3 రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆలోచన చేశారు. అందుకోసం ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బస్సులు మరిన్ని అవసరమైనప్పుడు ప్రైవేట్ బస్సులు , స్కూల్ బస్సులు ఏర్పాటు చేసుకునేలా అధికారులు ప్లాన్ చేసుకోవాలని అన్నారు. ఆర్టీసీ, రవాణా అధికారులు సమన్వయం తో కలిసి పని చేయాలని అన్నారు.

ALSO READ: దావోస్‌‌కు సీఎం రేవంత్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక సూచనలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు