నా అల్లుడిని కొట్టారు.. ఐటీ దాడులపై పొంగులేటి సంచలన ఆరోపణలు! తన ఇంటిలో జరుగుతున్న ఐటీ దాడులు గురించి పొంగులేటి స్పందించారు. తప్పుడు సమాచారంతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కనీసం నా ఇంటి నుంచి లక్ష రూపాయలు కూడా తీసుకుని వెళ్లలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. By Bhavana 10 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచి ఐటీ తనిఖీలు సాగుతున్నాయి. అటు ఖమ్మంతో పాటు, హైదరాబాద్ లలోని ఆయన ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గ్రూపులుగా విడిపోయి దాడులు చేస్తున్నారు. ఏకకాలంలో పొంగులేటి ఇళ్లు, ఆయన బంధువుల ఇళ్లు, వ్యాపార సంస్థలకు చెందిన కార్యాలయాలపై ఐటీ అధికారులు మూకుమ్మడిగా దాడులు జరిపారు. 8 ప్రత్యేక వాహనాల్లో పొంగులేటి నివాసానికి చేరుకున్న ఐటీ అధికారుల బృందం ఇంట్లో సోదాలు జరిపింది. మొత్తంగా 15 మంది ఐటీ అధికారులు, 10 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. పొంగులేటి కుటుంబ సభ్యులు నుంచి ఐటీ అధికారులు పొంగులేటి తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా తీసేసుకున్నారు. ఐటీ కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటిని పరిశీలించిన తరువాత వారు ఇంటిలోని అన్ని గదుల్లోనూ కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాలు ముగిసిన తరువాత పొంగులేటి మాట్లాడారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా నా పై కక్ష కట్టి నా ఇంటి మీద పడి నా ఇళ్లతో పాటు.. నా బంధువుల ఇళ్ల మీద ఐటీ దాడులు చేస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. 83 సంవత్సరాల నా తల్లి నివాసంలో కూడా బందిపోట్ల మాదిరి బీభత్సం సృష్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నా అల్లుడిని కొట్టి భయపెట్టారు. మా మీద, మా అనుచరుల మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్లు ఆయన తెలిపారు. Also read: నా భార్యను కలవాలని ఉంది..కోర్టులో పిటిషన్ వేసిన సిసోడియా! తన వద్ద భారీగా డబ్బులు ఉన్నాయని ఎవరో కానీ బాగా దుష్ప్రచారం చేసి చివరకు ఒక లక్ష కూడా పట్టుకోలేకపోయారని తెలిపారు. నా ఉద్యోగులను , బంధువులను ఇళ్లలో కూడా దాడులు నిర్వహించడమే కాకుండా..హౌస్ అరెస్ట్ లు చేసినట్లు ఆయన వివరించారు. నా భార్య, కుమారుడు, తమ్ముడిని ఐటీ అధికారులు వారి కారులోనే హైదరాబాద్ కు తీసుకుని వెళ్లారని చెప్పారు. కానీ నా కార్యకర్తల రియాక్షన్ వల్ల నన్ను హైదరాబాద్ తీసుకుని వెళ్లకుండా ఆగిపోయారని ఆయన వివరించారు. ఎప్పుడైతే పార్టీ మారానో ఆరోజే నా పై ఇలాంటి దాడులు జరుగుతాయని నేను ఊహించానని ఆయన వివరించారు. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టే ఇంత ధైర్యంగా ఉన్నానని ఆయన అన్నారు. అధికారంలోకి రాబోయే కాంగ్రెస్ ను అడ్డుకునేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ వారు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అన్నారు. అధికారంలో ఉండి లక్షలాది కోట్లు దోచుకుంటున్న బీఆర్‌ఎస్ నేతలను వదిలేసి పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతల పై పడుతున్నారని ఆయన మండిపడ్డారు. Also read: ఖతార్ లో నేవీ అధికారులకు మరణశిక్ష.. అప్పీల్ చేసిన భారత్! #khammam #hyderabad #ponguleti #it-attacks మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి