/rtv/media/media_files/2026/05/04/tvk-vijay-family-2026-05-04-16-45-01.jpg)
TVK vijay family
తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ సంచలనం సృష్టించింది. టీవీకే పార్టీ అధినేత విజయ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలుపొందడమే కాకుండా.. మొత్తం 108 స్థానాలతో ఆధిక్యంలో ఉన్నారు. హీరోగా సినిమాల్లో ఎన్నో రికార్డులు సృష్టించిన విజయ్‌కు ఫ్యామిలీ పరంగా రాజకీయ బ్యాగ్రౌండ్ ఉందా? విజయ్ ఫ్యామిలీ సంచలన ట్రాక్ రికార్డు ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు కాగా.. తల్లి శోభ చంద్రశేఖర్ ప్రముఖ గాయని. తండ్రి చంద్రశేఖర్ క్రైస్తవ మతానికి, తల్లి హిందూ మతానికి చెందినవారు. అయితే విజయ్‌కు విద్య అనే చెల్లెలు ఉండేది. కానీ చిన్న వయసులోనే ఆమె మరణించింది. ఈ సంఘటనతో విజయ్ తీవ్రంగా కుంగిపోయాడు. చెల్లెలి మరణం కంటే ముందు ఎంతో యాక్టివ్‌గా ఉండే విజయ్.. ఆమె మరణం తర్వాత సైలెంట్ అయ్యాడు. ఆమె జ్ఞాపకార్థం కింద తన నిర్మాణ సంస్థకు 'వి.వి. ప్రొడక్షన్స్' (విద్యా-విజయ్) అని పేరు పెట్టారు. అలాగే విజయ్‌కు వాస్ రాఘవేంద్ర అనే అన్నయ్య కూడా ఉన్నారు. అతను వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.
వీరాభిమాని సంగీతతో పెళ్లి
విజయ్ 1999 ఆగస్టు 25న సంగీత స్వర్ణలింగాన్ని వివాహం చేసుకున్నారు. లండన్‌లో పెరిగిన సంగీత, విజయ్‌కి వీరాభిమాని. వీరిద్దరూ హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. దాదాపు 27 ఏళ్ల పాటు అన్యోన్యంగా సాగిన వీరి వైవాహిక బంధానికి ఇటీవల వీడ్కోలు పలికారు. ఇద్దరు పరస్పర అంగీకారంతో ఈ ఏడాది కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారు. జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు వీరికి ఉన్నారు. మారుడు సంజయ్ ప్రస్తుతం 'సిగ్మా' అనే చిత్రంతో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అయితే తల్లిదండ్రుల విడాకుల నేపథ్యంలో సంజయ్ తన తల్లికి మద్దతుగా నిలిచారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రిని అన్‌ఫాలో చేయడంతో పాటు తన పేరు నుంచి తండ్రి ఇంటి పేరును కూడా తొలగించారు. కుమార్తె సాషా గతంలో విజయ్ చిత్రం 'తేరి'లో కూతురిగా నటించింది. ప్రస్తుతం ఆమె బ్యాడ్మింటన్ క్రీడపై దృష్టి సారించి మీడియాకు దూరంగా ఉంటున్నారు.
రాజకీయాల్లోకి అరంగేట్రం
సినిమాల్లో రాణిస్తూనే విజయ్ 2014 పార్టీని ప్రకటించారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఈ ఎన్నికల ఫలితాల్లో TVK పార్టీ ఆధిక్యంలో ఉండటంతో విజయ్ తప్పకుండా సీఎం కూర్చీలో కూర్చోనున్నారు. విజయ్ విజయంతో తమిళనాడులో కొత్త శకం మొదలైందని చెప్పవచ్చు.
Follow Us