చిల్లర చేష్టలు చేయకండి.. బీజేపీకి ఒమర్ అబ్దుల్లా రిక్వెస్ట్! జమ్మూకశ్మీర్ ఫలితాలపై 'నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ' నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాతీర్పును పార్టీలన్నీ గౌరవించాలని కోరారు. ప్రజల ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా బీజేపీ ఎలాంటి చిల్లర చేష్టలు, కుట్రలకు పాల్పడొద్దని సూచించారు. By srinivas 08 Oct 2024 in రాజకీయాలు Latest News In Telugu New Update షేర్ చేయండి Omar Abdullah: జమ్మూకశ్మీర్ ఫలితాలపై 'నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ' నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీలన్నీ ప్రజాతీర్పును గౌరవించాలని కోరారు. ప్రజల ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా బీజేపీ ఎలాంటి చిల్లర చేష్టలు, కుట్రలకు పాల్పడొద్దని సూచించారు. On a lighter note if anyone wants tips on surviving quarantine or a lock down I have months of experience at my disposal, perhaps a blog is in order. — Omar Abdullah (@OmarAbdullah) March 24, 2020 ఈ మేరకు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. విజయం మాదే. జమ్మూకశ్మీర్ ఓటర్లు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో పార్టీలన్నీ పారదర్శకంగా ఉండాలి. ప్రజల తీర్పు బీజేపీ వ్యతిరేకంగా ఉంటే వారు ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయొద్దు. ఎలాంటి కుట్రలకు పాల్పడొద్దు' అన్నారు. ఇక రెండు అసెంబ్లీ స్థానాలు గండేర్బల్, బుడ్గామ్ నుంచి పోటీపడిన ఒమర్.. రెండుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక నేషనల్ కాన్ఫరెన్స్ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 25, కాంగ్రెస్ 11, పీడీపీ 5, ఇతరులు 9 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆ నిర్ణయాన్ని మేము అంగీకరించట్లేదు.. ఇదిలా ఉంటే.. పదేళ్ల తర్వాత ప్రజలు తమ తీర్పును వెల్లడించారు. ఆగస్టు 5 నాటి నిర్ణయాన్ని మేము అంగీకరించడం లేదు. ఒమర్ అబ్దుల్లానే ముఖ్యమంత్రిగా ఉంటారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు మా కూటమి నిరంతరం పోరాడుతుందని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. #jammu-and-kashmir #Omar Abdullah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి