/rtv/media/media_files/2026/06/10/meenakshi-2026-06-10-07-31-30.jpg)
మీనాక్షి నటరాజన్‌కు ఎన్నికల నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నామినేషన్ తిరస్కరించిన విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. నామినేషన్ తిరస్కరణకు గురైతే.. అభ్యర్థులు ముందుగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని న్యాయమూర్తులు సూచించారు. గతంలో ఇలాంటి విషయాల్లో కోర్టు జోక్యం చేసుకున్నట్లు ఏవైనా తీర్పులు ఉంటే చూపించాలని అడిగారు.
News Alert ! Show us any judgement where we have interfered in rejection of nomination papers: SC asks Cong leader Meenakshi Natarajan's lawyer.
— Press Trust of India (@PTI_News) June 12, 2026
Once nomination is rejected, remedy is to approach Election Commission: SC tells Meenakshi Natarajan's lawyer. pic.twitter.com/9uz8kKNqP2
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఏకైక అభ్యర్థిగా బరిలోకి దిగిన మీనాక్షి నటరాజన్.. దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. హైదరాబాద్ కోర్టులో తనపై పెండింగ్‌లో ఉన్న ఒక క్రిమినల్ కేసు వివరాలను, అలాగే తన ఆస్తిపాస్తులకు సంబంధించిన వాస్తవాలను నామినేషన్ పత్రాల్లో మీనాక్షి నటరాజన్ వెల్లడించలేదని భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న రిటర్నింగ్ అధికారి, ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ జూన్ 9వ తేదీ సాయంత్రం 5:30 గంటల వరకు గడువు విధిస్తూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయితే నిర్ణీత సమయంలోగా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిబంధనల ప్రకారం ఆమె నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చూడండి:Ireland: : ఐర్లాండ్‌లో అల్లర్లు.. వలసదారులను లక్ష్యంగా చేసుకున్న హింస
ఇంతకీ కేసు ఏంటి?
తార్నాక మాజీ కార్పొరేటర్ శ్రీలత, నారాయణపేట కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్‌రెడ్డిపై తీవ్ర వేధింపుల ఆరోపణలు చేస్తూ న్యాయపోరాటం మొదలుపెట్టారు. 2022, 2023లలో పంజాగుట్ట, బెంగళూరులో కేసులు నమోదు చేసినా ఫలితం లేకపోవడంతో.. ఆమె ఆగస్టు 20న నాంపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. తన పరువుకు నష్టం కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొంటూ 16 పేజీల ఫిర్యాదును కోర్టుకు సమర్పించారు. ఈ పిటిషన్‌లో శివకుమార్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే చిట్టెం పర్నికారెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కే ప్రశాంత్ రెడ్డి, చిట్టెం అభిజయ్ రెడ్డి, మీనాక్షి నటరాజన్‌లను ప్రతివాదులుగా చేర్చారు. తనకు జరిగిన నష్టానికి రూ.10 కోట్ల పరిహారం ఇప్పించాలని ఆమె కోరారు. కోర్టు ఈ పిటిషన్‌కు ఎస్‌ఆర్ నంబర్ కేటాయించి నోటీసులు జారీ చేసినప్పటికీ.. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.
ఇది కూడా చూడండి:Neethu Bhai : ఐటీ కారిడార్‌లో ‘గంజాయి సామ్రాజ్యం’.. మరోసారి తెరమీదకు "నీతూబాయ్'
ఇదిలా ఉండగా ఢిల్లీలో లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు.
Follow Us