/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Prakash-Raj-1-jpg.webp)
Actor Prakash Raj:
తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిస్తోందని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు ఇది నేషనల్ వైడ్‌గా పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. ఎన్‌డీడీబీ ఇచిన రిపోర్ట్ ఆధారంగా లడ్డూలో జంతుమాంస కృతులు కలిశాయని కూటమి ప్రభుత్వం అంటోంది. వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరుని పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ సీఎం చద్రబాబు ఆరోపణలు చేశారు. దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశం గురించి తెలిసి తీవ్ర కలత చెందినట్లు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. బాధ్యులపై కఠిన చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వివరించారు. వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు జవాబు చెప్పాలన్నారు. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ ఈ సందర్భంగా కోరారు. ఆలయాల రక్షణపై మతాధిపతులు, న్యాయనిపుణులు, అన్ని వర్గాల ప్రతినిధులతో జాతీయ స్థాయిలో చర్చ జరిపి దీని గురించి తీవ్రంగా చర్చిస్తామన్నారు. ఆలయాలపై జాతీయ స్థాయి విధానం అవసరమని ఈ సందర్భంగా పవన్ అన్నారు.
పవన్ పోస్ట్ ను పరిగణనలోకి తీసుకుంటూ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా విమర్శించారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో కదా తప్పు జరిగింది. దోషులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోండి. అంతేగాని ఆ విషయాన్ని దేశవ్యాప్తంగా ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇప్పటికే దేశంలో చాలా మతకల్లోలాలు ఉన్నాయి. మళ్ళీ కొత్తది ఎందుకు అంటూ విమర్శించారు.
Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l
— Prakash Raj (@prakashraaj) September 20, 2024
దేశ రాజకీయాల్లో నటుడు ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఈయన వ్యాఖ్యలు చేస్తుంటారు ఎప్పుడూ. ఇప్పుడు కూడా తిరుపతి లడ్డూపై పెట్టిన పోస్ట్‌లో చివర్లో మతకల్లోలా గురించి చెబుతూ థాంక్స్‌టూ యువర్ ఫ్రెండ్స్ ఇన్ సెంటర్ అంటూ పరోక్షంగా బీజేపీ నేతలనే విమర్శించారు ప్రకాశ్ రాజ్.
Also Read: Hezbollah: బీరుట్‌లో ఇజ్రాయెల్ దాడి..హిజ్బుల్లా కీలక కమాండర్ మృతి