Manipur: పోలీసు అధికారి కిడ్నాప్‌.. నిరసనకు దిగిన పోలీసులు

మణిపుర్‌లో ఓ పోలీసు అధికారి కిడ్నాప్‌ కావడంతో అక్కడి పోలీసులు బుధవారం ఉదయం కొద్దిసేపు ఆయుధాలను వదిలేసి విధులకు హాజరయ్యారు. చివరికి భద్రతా బలగాలు రంగంలోకి దిగడంతో ఆగంతకులు ఆయన్ని గంటల వ్యవధిలోనే విడిచిపెట్టారు.

New Update
Manipur: పోలీసు అధికారి కిడ్నాప్‌.. నిరసనకు దిగిన పోలీసులు

సాధారణంగా ఎవరైన కిడ్నాప్‌ అయితే నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగుతారు. కానీ మణిపుర్‌లో ఏకంగా ఓ పోలీసు అధికారి కిడ్నాప్ కావడం కలకలం రేపుతోంది. ASP స్థాయి అధికారి ఇంటిపై దాడి చేసి.. ఆయన్ని, ఆయన సిబ్బందిని కొందురు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. ఈ విషయం బయటపడటంతో.. ఆ పోలీసు అధికారికి సంఘీభావంగా అక్కడి స్థానిక పోలీసులు వినూత్న నిరసన చేశారు. బుధవారం ఉదయం పూట కొద్దిసేపు ఆయుధాలను వదిలేసి తమ విధులకు హాజరయ్యారు.

Also Read: సచిన్‌ జమ్మూ పర్యటన.. ప్రధాని మోదీ ఏమన్నారంటే

200 మంది సాయుధులు దాడి 

ఏఎస్పీ కిడ్నాప్‌ కావడంపై.. భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. చివరికి కొన్ని గంటల వ్యవధిలోనే ఆగంతకుల నుంచి ఆ పోలీసు అధికారిని విడిపించినట్లు మణిపుర్‌ పోలీసులు తెలిపారు. మంగళవారం పశ్చిమ ఇంఫాల్‌లోని ఏఎస్పీ అమిత్‌ సింగ్‌ ఇంటిపై 200 మంది సాయుధులు దాడులు చేశారు. అమిత్‌ సింగ్‌తో పాటు, ఆయన సిబ్బంది ఒకరిని కిడ్నాప్‌ చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రతీకారం కోసమే కిడ్నాప్ !

అయితే ఇటీవల ఓ వాహనం దొంగిలించారనే ఆరోపణలతో.. అరంబై టెంగోల్‌ అనే గ్రూప్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులను ఏఎస్పీ అమిత్‌ సింగ్ అరెస్టు చేశారు. దీనికి ప్రతికారంగా ఆ వర్గం వాళ్లే.. తమ వాళ్లను విడిచిపెట్టాలని డిమాడ్ చేస్తూ ఆ పోలీసు అధికారి ఇంటిపై దాడులకు దిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై శాంతిభద్రతలకు భంగం కలగకుండా రాష్ట్ర హోంశాఖ అప్రమత్తమైంది.

మెయితీ, కుకీల మధ్య ఘర్షణ

ఇదిలాఉండగా.. మణిపుర్‌లో గత కొంతకాలంగా మెయితీలు, కుకీల మధ్య ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మెయితీలకు రిజర్వేషన్లను కల్పించాలన్న అంశాన్ని పరిశీలించాలని గత ఏడాది మార్చి 27న కేంద్రగిరిజన శాఖకు హైకోర్టు ప్రతిపాదనలు చేసింది. కానీ మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వొద్దంటూ అక్కడి కూకీ, నాగా తెగలు డిమాండ్ చేశాయి. ఈ విషయంలోనే ఇరువర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్‌లో నెలకొన్న సమస్యను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు అక్కడ ఎలాంటి పరిష్కారం జరగకపోవడం గమనార్హం.

Also Read: నేను రాజీనామా చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన సుఖ్విందర్ సింగ్

Advertisment
Advertisment
తాజా కథనాలు