Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై పోలీసుల కీలక ప్రకటన.. ఏం అన్నారంటే.. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. బ్యారేజీ వంతెన పిల్లర్లపై పగుళ్లు ఉన్నట్లు గుర్తించామని.. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఫోరెన్సీక్ క్లూస్ టీం సాయంతో కూడా ఆధారాలు సేకరిస్తున్నామని.. ఇప్పటికే కేంద్ర కమిటీ కూడా బ్యారేజీని పరిశీలించిందని చెప్పారు. By B Aravind 24 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ వంతెన కుంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. బ్యారేజీ డ్యామెజ్‌పై స్పందించిన ఎస్పీ కిరణ్ ఖారే.. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని తెలిపారు. బ్యారేజీ వంతెన పిల్లర్లపై పగుళ్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఫోరెన్సీక్ క్లూస్ టీం సాయంతో కూడా ఆధారాలు సేకరిస్తున్నామని.. కేంద్ర కమిటీ కూడా బ్యారేజీని పరిశీలించిందని చెప్పారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తామని.. ప్రస్తుతం మా దర్యాప్తు కొనసాగతుందని తెలిపారు. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదంలో ఉన్నందున ఎవరినీ అక్కడికి అనుమతించడం లేదని స్పష్టం చేశారు. Also read: కర్ణాటక వీడియోతో కాంగ్రెస్ పై కేటీఆర్ పంచ్ లు.. ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో అంటూ..! ఇదిలా ఉండగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ ఇటీవల కుంగిపోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో బ్యారేజ్‌ను కేంద్రం బృందం మంగళవారం పరిశీలించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించింది. బ్యారేజీలోని 6వ బ్లాకు నుండి 8వ బ్లాకు వరకు, 15వ పిల్లరు నుండి 20వ పిల్లరు వరకు కేంద్రం బృందం పరిశీలిన చేసింది. ఇక హైదరాబాద్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్షి జరిపిన అనంతరం కేంద్రానికి దీనిపై ఓ నివేదిక ఇవ్వనుంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విపక్ష నేతలు కూడా బీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలని కరీనంగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు . జరిగిన నష్టాన్ని కూడా వారి నుంచే రాబట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీక్ అవుతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇసుకమీదే ఆ ప్రాజెక్టు కట్టారని.. అప్పట్లో కన్నెపల్లి పంప్‌హౌస్ మొత్తం కూలిపోయిందంటూ విమర్శలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై నిపుణుల కమిటీ వేసి ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. Also read: 50 వేల మెజార్టీకీ ఒక్క ఓటు తగ్గినా.. రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్ #telugu-news #telangana-news #cm-kcr #medigadda-project #kaleshwaram-project #medigadda-barrage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి