Viral : తెలుగు విద్యార్థి జాహ్నవి మృతిపై పోలీస్ అధికారి ఆడియో వైరల్..!!

అమెరికాలో భారతీయ విద్యార్థి మృతి చెందిన ఘటనపై అక్కడి పోలీసులు వెకిలి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పోలీస్ అధికారికి మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియో జాహ్నవి మరణంపై పోలీసు అధికారి వెకిలిగా మాట్లాడిన మాటలను స్పష్టంగా వినవచ్చు.

New Update
Viral : తెలుగు విద్యార్థి జాహ్నవి మృతిపై పోలీస్ అధికారి ఆడియో వైరల్..!!

Telugu Student Jahnavi: అమెరికాలో భారతీయ విద్యార్థి మృతి చెందిన ఘటనపై అక్కడి పోలీసులు వెకిలి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పోలీస్ అధికారికి మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో జాహ్నవి మరణంపై పోలీసు అధికారి వెకిలిగా మాట్లాడిన మాటలను స్పష్టంగా వినవచ్చు.

View this post on Instagram

A post shared by Brut India (@brut.india)

అమెరికా పోలీస్ మాటలు కలకలం రేపుతున్నాయి. ఒక బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తూ అలా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అమెరికాలోని సియాటెల్ లో నార్త్ ఈస్టర్స్ లో చదువుతున్న కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన యువతి జాహ్నవి రోడ్డు ప్రమాదంలో మరణించింది. అది కూడా పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టి. దాన్ని దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీస్ అధికారి డానియెల్ అడరర్….ఋ మరణం వివరాలు పై అదికారులకు చెబుతూ చాలా చులకనగా మాట్లాడారు. ఇదంతా అతని బాడీకి ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తాజాగా ఆ రికార్డ్స్ బయటపడడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీస్ అధికారి మాట్లాడిన ఆడియో ఓ సారి వినండి..

ఏమన్నాడంటే…
ఆమె చచ్చిపోయింది…మామూలు వ్యక్తే. ఓ పదకొండు వేల డాలర్ల చెక్కు రాస్తే చాలు. ఆమెకు 26 ఏళ్ళు ఉంటాయేమో…విలువ తక్కువే అంటూ పగలబడి నవ్వుతూ మాట్లాడాడు డానియెల్ అడరర్. అంతేకాదు జాహ్నవిని ఢీకొట్టిన పోలీస్ ఆఫీసర్ కెవిన్ ను కాపాడ్డానికి కూడా ట్రై చేశాడు. ఆమెను ఢీకొట్టినప్పుడు కెవిన్ గంటకు 50 మైళ్ళ వేగంతో కారు పడుపుతున్నాడని…అది చాలా తక్కువ వేగమేనని, పైగా కారు కూడా అదుపు తప్పలేదని దర్యాప్తులో పేర్కొన్నాడు డానియెల్. తప్పు జాహ్నవిదే అన్నట్టు చూపించడానికి ప్రయత్నించాడు. కానీ కెవిన్ కారు 74 మైళ్ళ వేగంతో వెళుతోందని…కారు అదుపు తప్పిందని ఫోర్సెనిక్, ఇతర దర్యాప్తుల్లో తేలింది.

ఈ మొత్తం వ్యవమారంపై భారత ప్రభుత్వం సీరియెస్ అయింది. ఈ ఉదంతపై లోతైన దర్యాప్తు జరపాలని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ డిమాండ్ చేసింది. మనిషి మరణంపై చులనకగా మాట్లాడడం సరికాదని మండిపడింది. ఈ అంశంపై అమెరికా ఉన్నతాధికారుల ఫిర్యాదు చేశామని ట్వీట్ చేసింది.

మరిన్ని కథనాలు చదవండి: 

యాపిల్‎కు బిగ్ షాక్..ఈ పాపులర్ ఐఫోన్‎పై నిషేధం..!!

RBIలో అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్‌మెంట్..ఈ అర్హతలుంటే అప్లయ్ చేసుకోండి…!!

ఢిల్లీ హైకోర్టు సంచలన నిర్ణయం..విడాకులు తీసుకున్న కూతురుకు తండ్రి ఆస్తిపై హక్కు లేదంటూ తీర్పు.!!

Advertisment
Advertisment
తాజా కథనాలు