మహిళా సాధికారత కోసం కట్టుబడి ఉన్నాం-రాజ్యసభలో ప్రధాని కీలక వ్యాఖ్యలు కొత్త పార్లమెంటు భవనంలో లోక్ సభతో పాటూ ఈరోజు రాజ్యసభ కూడా కొలువు తీరింది. రానున్న రోజుల్లో భారత్ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారబోతోందని...దానికి కొత్త పార్లమెంట్ సాక్ష్యంగా నిలుస్తుందని ఆయన అన్నారు. By Manogna alamuru 19 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి నూతన పార్లమెంటు భవనంలో రాజ్యసభను ప్రధాని మోదీ అడ్రస్ చేశారు. భారతదేశ చరిత్రలో ఈరోజు నిలిచిపోతుందని అన్నారు. ఇది అందరికీ మరిచిపోలేని రోజని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో కొత్త విప్లవాలకు నూతన పార్లమెంట్ భవనం సాక్ష్యంగా నిలుస్తుందని మోదీ చెప్పారు. భారత్ ఇప్పటికే ప్రపంచ ఐదవ ఆర్ధిక వ్యవస్థగా ఉందని తొందరలోనే మూడవ అతి పెద్ద ఆర్ధిక వ్యస్థగా మారుతుందని చెప్పారు. ప్రజలు దేశ పార్లమెంట్ మీద నమ్మకం పెట్టుకున్నారని అందుకు తగ్గట్టుగానే ఎన్నో విప్లవాత్మ బిల్లులను ప్రవేశపెట్టామని చెప్పుకున్నారు. #WATCH | In the Rajya Sabha of the new Parliament building, PM Narendra Modi says, "...we did not have a majority in the Rajya Sabha but we were confident that the Rajya Sabha would rise above political thinking and take decisions in the interest of the country. Because of your… pic.twitter.com/1uxql7s3u8 — ANI (@ANI) September 19, 2023 మేక్ ఇండియా వల్లనే భారత్ తొందరగా ఎదిగిందని...అదే గేమ్ ఛేంజర్ అని అన్నారు ప్రధాని మోదీ. 2047 కల్లా భారత్ ప్రపంచ అగ్రగామిగా నిలుస్తుందని తెలిపారు. ఎంతో గర్వంగా స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటామని అన్నారు. దేశ నిర్మాణంలో మహిళదే కీలక పాత్రను వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత కోసం కట్టుబడి ఉన్నామని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే లోక్ సభలో మమిళా రిజర్వేషన్, త్రిపుల్ తలాక్ బిల్లులను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. #WATCH | In the Rajya Sabha of the new Parliament building, PM Narendra Modi says..." Federal structure presented India's power in front of the world and the world was impressed...during G 20 summit, various meetings took place across different states. Every state with great… pic.twitter.com/IgQoHNldJo — ANI (@ANI) September 19, 2023 ఇక ఈరోజు ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు మీద రేపు లోక్ సభలో చర్చ జరగనుంది. అలాగే 21వ తేదీన రాజ్యసభలో చర్చకు రానుంది. రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందితే 2027 డీ లిమిటేషన్ తర్వాతనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. #parliament #narendra-modi #india #prime-minister #rajya-sabha #new #session #woman-reservation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి