PM Modi: రాజ్యసభలో కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డ ప్రధాని..ఖర్గేకు మోదీ చురకలు

కాంగ్రెస్ పార్టీ మీద ఫుల్ సెటైర్లేశారు ప్రధాని మోదీ. రాహుల, సోనియాలను మిస్ అయ్యాము అనుకున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆ లోటును తీర్చారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావని అన్నారు.

New Update
PM MODI: రిజర్వేషన్లకు నెహ్రు వ్యతిరేకి.. మోదీ సంచలన వ్యాఖ్యలు..!!

Modi in Rajya Sabha: మొన్న లోక్‌సభలో కాంగ్రెస్ మీద విరుచుకుపడిన ప్రధాని మోదీ ఈరోజు రాజ్య సభలోనూ వదిలిపెట్టలేదు. రాజ్యసబలో రాష్ట్రపతి ప్రసాంగానికి ధన్యవాద తీర్మానం మీద ఆయన మాట్లాడుతున్నారు. ఇందులో పనిలో పనిగా కాంగ్రెస్ (Congress) మీద కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోక్‌సభలో ఖర్గేను (Mallikarjun Kharge) చాలా మిస్ అయ్యాను. ఆయనను రాజ్యసభలో కలవడం ఆనందంగా ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 400 సీట్లు రావాలని ఖర్గే ఆశీర్వదించారు...కానీ కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు. ఇండియా కూటమిలోని మిత్రపక్ష నేత అయిన మమతా బెనర్జీనే (Mamata Benarjee) ఆ మాట అన్నారని మోదీ చెప్పారు. కాంగ్రెస్ పరిస్థితి చాలా దిగజారిపోయిందని...అయితే అదేమీ తనకు ఆనందాన్ని ఇవ్వండం లేదని మోదీ అన్నారు.

కాంగ్రెస్ ఇంకా పాత రోజుల్లోనే ఉండిపోయింది..

కాలంతో పాటూ కాంగ్రెస్ ఎదగలేదని...ఇంకా పాత రోజుల్లోనే ఉండిపోయిందని విమర్శించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ ఔట్ డేటెడ్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని మాత్రం కాంగ్రెస్ ఖూనీ చేసినంత ఎవరూ చేయలేదని మండిపడ్డారు. అంబేద్కర్‌కు (Ambedkar)  భారతరత్న ఇవ్వాలని అనుకోలేదు కానీ కాంగ్రెస్ తమ కుటుంబ సభ్యఉలకు మాత్రం ఇచ్చుకుంది. భారతీయ సంస్కృతిని అసహ్యించుకుని...బ్రిటీష్ పార్లమెంటు ఎలా నడిపిందో అలా మన దేశ పార్లమెంటును కూడా నడిపించారు అంటూ దుయ్యబట్టారు. యూపీఏ పాలనలో దేశ ఆర్ధిక వ్యవస్థ నాశనమైందని అన్నారు. తన విశ్వసనీయతను కోల్పోయిందని..వచ్చే ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమని అన్నారు మోదీ.

దేశాన్ని విభజించేందుకు చూస్తోంది...

ఇప్పుడు కూడా కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేయడానికి చూస్తోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఉత్తరం , దక్షిణం అంటూ విభజించి పాలించాలని చూస్తోందని ఆరోపించారు. నా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు చూస్తున్నారు. కానీ నాకు మాట్లాడే అధికారాన్ని ప్రజలే కట్టబెట్టారని చెప్పారు. దేవ పురోగతిని కాంగ్రెస్ అడ్డుకుందని అన్నారు. ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ వ్యతిరేకమని...గిరిజన రాష్ట్రపతిని వ్యతిరేకించారని చెప్పారు. రిజర్వేషన్లు దేశాన్ని అస్థిరపరుస్తాయని నెహ్రూ అన్నారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు అదే పాటిస్తూ వచ్చింది.  నెహ్రూ (Nehru) టైమ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం కాంగ్రెస్ పాలన, వ్యహారాలను ఏకి పారేశారు మోది.

Also Read: ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్థాన్‌లో భారీ పేలుడు, 26 మంది దుర్మరణం..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు