PM Modi Bengal Visit: మోదీతో దీదీ భేటీ...ఇది రాజకీయ సమావేశం కాదన్న మమతా.!

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్లో పర్యటిస్తున్నారు. ఈరోజు ప్రధాని రూ.7,200 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాజ్ భవన్లో ప్రధానితో భేటీ అయిన మమతా ఇది రాజకీయ సమావేశం కాదన్నారు.

New Update
PM Modi Bengal Visit: మోదీతో దీదీ భేటీ...ఇది రాజకీయ సమావేశం కాదన్న మమతా.!

PM Modi Bengal Visit:  ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని రూ.7,200 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.అనంతరం బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీని కలిశారు. ప్రధాని మోదీని కలిసిన అనంతరం సీఎం మమత మాట్లాడుతూ.. ఇది ప్రోటోకాల్‌ సమావేశమని, మర్యాదపూర్వక సమావేశమని అన్నారు. నేను ఎలాంటి రాజకీయ విషయాలను చర్చించలేదని... ఎందుకంటే ఇది రాజకీయ సమావేశం కాదు అన్నారు.

అంతకుముందు, బెంగాల్‌లోని ఆరంబాగ్‌లో 7200 కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. బెంగాల్‌కు 7200 కోట్ల రూపాయల బహుమతిని ఇచ్చిన తర్వాత ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగించారు. సందేశ్‌ఖాలీలో జరుగుతున్న ఘటన యావత్ దేశాన్ని విషాదంలోకి నెట్టిందని ప్రధాని మోదీ అన్నారు. సందేశ్‌ఖాలీలో, సోదరీమణులు, కుమార్తెలలో ధైర్యం పరిమితులు దాటిందన్నారు. బెంగాల్‌లో టిఎంసి నేరాలు, అవినీతికి కొత్త నమూనాను సృష్టించయాని మోదీ ఆరోపించారు.

నేరస్థులకు రక్షణగా టీఎంసీ నాయకులకు భారీ మొత్తంలో డబ్బు పంచుతుందన్నారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందితేనే భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు ప్రధాని. ఇందుకోసం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి అన్ని స్థానాల్లో కమలం వికసించాల్సిన అవసరం ఉందన్నారు. టీఎంసీకి నిర్దిష్ట ఓటు బ్యాంకు ఉందన్న గర్వంతో విర్రవీగుతూందని...ఈసారి టీఎంసీ అహంకారాన్ని ఓట్ల రూపంలో అణచివేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

సందేశ్‌ఖలీ హింసను ప్రస్తావిస్తూ, సందేశ్‌ఖాలీలోని సోదరీమణులపై టీఎంసీ చేసిన పనికి దేశం మొత్తం విచారంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఘటన పట్ల మమతా బెనర్జీ ప్రభుత్వం సిగ్గుపడాలని ప్రధాని అన్నారు. ఈ ఘటనలో నిందితులను మమతా దీదీ రక్షించారని చెప్పారు. ప్రజల ఒత్తిడి మేరకు నిందితుడిని పోలీసులు పట్టుకున్నారన్నారు ప్రధాని. సందేశ్‌ఖలీ ఘటనపై రాజా రామ్‌మోహన్‌రాయ్‌ ఆత్మ రోదిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు.

ఇది కూడా చదవండి: విద్యార్థులకు అలర్ట్..వరుసగా మూడు రోజులు సెలవులు..పూర్తి వివరాలివే.!

Advertisment
Advertisment
తాజా కథనాలు