Vande Bharat Express: నేడు కాచిగూడు-యశ్వంత్పూర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!! తెలంగాణలో మూడో వందేభారత్ రైలు కూతపెట్టనుంది. కాచిగూడ-యశ్వంతపూర్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. By Bhoomi 24 Sep 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం ప్రభుత్వం. తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను నేడు ప్రారంభించనుంది. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణకు ప్రాధాన్యతను ఇస్తుంది కేంద్రం. ఇప్పటికే సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలును ఉగాది కానుకుగా సికింద్రాబాద్ -తిరుపతి వందేభారత్ రైలును కేంద్రం ప్రారంభించింది. ఇప్పుడు మరోసారి వినాయకచవితి నవరాత్రులకు కానుకగా ఇవాళ కాచిగూడు బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభిస్తుంది. ఇది తెలంగాణ నుంచి మూడో వందే భారత్ ఎక్స్ ప్రెస్ కానుంది. నేడు మధ్యాహ్నం 12గంటలకు కాచిగూడలో ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా ఈ రైలును ప్రారంభించనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది కూడా చదవండి: తెలంగాణ టీఆర్టీ అభ్యర్థులకు కొత్త టెన్షన్.. ఆ సమస్య పరిష్కారం ఎలా? నేడు ప్రారంభించనున్న ఈ రైలు మినహా నేడు అన్ని రైళ్లు ప్రతిరోజూ కాచిగూడ నుంచి ఉదయం 5.30గంటలకు బయలుదేరుతుంది. మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపూర్ స్టేషన్లో ఆగుతూ..యశ్వంత్ పూర్ కు మధ్యాహ్నం 2.15కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 3గంటలకు యశ్వంత్ పూర్ నుంచి బయలు దేరి రాత్రి 11.15గంటలకు కాచిగూడ చేరుకుంటుందని కేంద్రం తెలిపింది. ఆదివారం ఒక్కరోజు మాత్రం మధ్యాహ్నం 12.30కి కాచిగూడు నుంచి బయలుదేరి ఫలక్ నుమా, ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర, గద్వాల్ మీదుగా యశ్వంత్ పూర్ చేరుకుంటుంది. ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై తొలిసారి భేటి అయిన కోవింద్ కమిటీ మూడో వందేభారత్ రైలు 12 జిల్లాల గుండా ప్రయాణించనుంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, ఏపీలో కర్నూలు, నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్యసాయి , కర్నాటక చిక్ బళ్లాపూర్, బెంగళూరు రూరల్ మీదుగా ప్రయాణిస్తుంది. దీని సగటు వేగం గంటకు 71.74 కిలీమీటర్లతో దూసుకుపోతుంది. గతంలో ఈ దూరం ప్రయాణించేందుకు పట్టే సమయం 11.20గంటలు కాగా వందేభారత్ రైలుతో 8.30 గంటల్లో ప్రయాణించవచ్చని కేంద్రం తెలిపింది. #telangana #pm-modi #vande-bharat #vande-bharat-express మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి