PM Modi: ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం.. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్'తో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్.. మోదీని సత్కరించారు. By B Aravind 09 Jul 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్'తో ఆ దేశ అధ్యక్షడు వ్లాదిమీర్ పుతిన్.. మోదీని సత్కరించారు. 2019లో కూడా మాస్కోలో సెయింట్ కేథరీన్స్ హాల్‌లో ప్రధాని మోదీకి పుతిన్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మరోసారి మోదీకి ఈ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. రష్యా-భారత్ మధ్య స్నేహపూర్వకమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో మోదీ చేసిన కృషికి గానూ ఈ పురస్కారాన్ని అందించారు. #WATCH | Russian President Vladimir Putin confers Russia's highest civilian honour, Order of St Andrew the Apostle on Prime Minister Narendra Modi. pic.twitter.com/aBBJ2QAINF — ANI (@ANI) July 9, 2024 ఈ పురస్కారం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. రష్యా అత్యున్నత పౌర పురస్కారంతో తనను సత్కరించినందుకు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం నా ఒక్కనికి మాత్రమే కాదని.. 140 కోట్ల భారత ప్రజల సొంతమని వ్యాఖ్యానించారు. అలాగే రష్యా-భారత్ మధ్య శతాబ్దాలుగా ఉన్న స్నేహం, పరస్పర నమ్మకానికి గౌరవమని అన్నారు. గత రెండున్నర దశాబ్దాలుగా.. పుతిన్ నాయకత్వంతో భారత్-రష్యా మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయని అన్నారు. ఇరుదేశాల మధ్య పరస్పర సహాకారం మన ప్రజలకు మంచి భవిష్యత్తు అందించే దిశగా వెళ్తోందన్నారు. #WATCH | Prime Minister Narendra Modi says, "...I extend my heartfelt gratitude to you (President Putin) for honouring me with Russia's highest (civilian) award. This honour is not just mine, this is the honour of 140 crore Indians. This is the honour of the centuries-old deep… pic.twitter.com/NpfcVImn4U — ANI (@ANI) July 9, 2024 #pm-modi #putin మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి