PM Modi: యుద్ధం వేళ పుతిన్, జెలెన్‌స్కీతో మోదీ చర్చలు.. ఆంతర్యమేంటి!?

భీకర యుద్ధం వేళ రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో భారత ప్రధాని మోదీ కీలక సమావేశాలు నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం స్థాయిని మరింత పెంచడంతోపాటు ప్రపంచ భద్రతకు శాంతి మార్గాలను భారత్ సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

New Update
PM Modi: యుద్ధం వేళ పుతిన్, జెలెన్‌స్కీతో మోదీ చర్చలు.. ఆంతర్యమేంటి!?

PM Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ.. వ్లాదిమిర్ పుతిన్, వోలోడిమిర్ జెలెన్‌స్కీతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన నాయకులు ఉక్రెయిన్ పక్షాన నిలబడి రష్యాను దురాక్రమణదారుగా పేర్కొంటూ ఉక్రెయిన్ పై దాడిని ఖండించిస్తున్నారు. ఇలాంటి సమయంలో మోదీ రెండు దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించడంతోపాటు వ్యూహాత్మకంగా శాంతికి కట్టుబడి ఉండాలని సూచిచడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భిన్నమైన భారత్ విధానం..
ఇప్పటికే జెలెన్‌స్కీ శాంతి చర్చల ప్రతిపాదనను రష్యా తిరస్కరించింది. దీంతో అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించి ఉక్రెయిన్‌కు తిరుగులేని మద్దతునిచ్చాయి. అయితే దీనికి విరుద్ధంగా భారత్ విధానం చాలా భిన్నంగా ఉంది. ఇరుదేశాలకు దూరం కాకుండానే జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ గా చర్చలు కొనసాగిస్తోంది. మోదీతో పుతిన్, జెలెన్‌స్కీని కలవడం కేవలం దౌత్యపరమైన సంజ్ఞ మాత్రమే కాదు.. ఇది ఇరుదేశాల మధ్య పరస్పర సహకారాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఇరువురు నాయకులతో భేటీలో భారతదేశంతో దీర్ఘకాలిక సంబంధాలను ప్రస్తావిస్తూనే.. వారిద్దరి మధ్య శాంతిని పెంపొందించేందుకు మోదీ బలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ చర్యతో భారతదేశం స్థాయిని మరింత పెంచడమే కాకుండా ప్రపంచ భద్రతకు శాంతి మార్గాలను భారత్ సూచిస్తున్నట్లు అవుతోంది.

విశ్వసనీయ మిత్రదేశాల్లో భారత్ ఒకటి..
గతకొన్నేళ్లుగా రష్యాతో భారతదేశ సంబంధాలు లోతుగా పాతుకుపోయాయి. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ అత్యంత విశ్వసనీయ మిత్రదేశాలలో భారతదేశం ఒకటి. సైనిక మద్దతుతోపాటు దౌత్యపరమైన సపోర్టును అందించింది. దీంతో భారత్ కు రష్యా ఒక కీలక భాగస్వామిగా ఉంది. ముఖ్యంగా రక్షణ రంగంలో రష్యా సైనిక పరికరాలు, సాంకేతికతపై భారత్ ఎక్కువగా ఆధారపడుతోంది. అదే సమయంలో భారత్ యునైటెడ్ స్టేట్స్‌తో వాణిజ్యం, రక్షణ, సాంకేతిక రంగాలలో బలమైన సంబంధాలను పెంచుకుంది. ఈ ద్వంద్వ విధానం భారత్ భవిష్యత్తు వ్యూహానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా అంతర్జాతీయ సంబంధాలను కొనసాగించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని స్పష్టమవుతోంది.

ఇది కూడా చదవండి: CS Shanthi kumari: హైడ్రాకు మరిన్ని అధికారాలు.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు!

ప్రపంచంతో మరింత స్వతంత్రంగా..
రష్యా, ఉక్రెయిన్ వివాదంపై భిన్నమైన వైఖరులు ఉన్నప్పటికీ రెండింటితో సంబంధాలను కొనసాగించడం, వారింతో భారత్ సంబంధాలను బలోపేతం చేయడంపై మోదీది గొప్ప దౌత్యపరమైన విజయంగా అభివర్ణించవచ్చు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును కొనసాగిస్తూనే యుఎస్‌తో రక్షణ, ఆర్థిక భాగస్వామ్యాన్ని భారత్ మరింత విస్తరించుకుంది. ఈ బ్యాలెన్సింగ్ రూల్ భారతదేశం వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడడమే కాకుండా ప్రపంచంతో మరింత స్వతంత్రంగా వ్యవహరించే సామర్థ్యాన్ని కూడా పెంచినట్లు అవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు