/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-08T183846.710.jpg)
భారత ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ దాదాపు ఐదేళ్ల తర్వాత కలుసుకోనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ.. రష్యాకు చేరుకున్నారు. జులై 8, 9వ తేదీల్లో అక్కడ జరగనున్న 22వ భారత్ - రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మోదీ - పుతిన్ సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మోదీ పర్యటనతో పశ్చిమ దేశాల ప్రణాళికలను ఇబ్బంది పెట్టేందుకు పుతిన్ ప్లాన్ చేస్తున్నారని ఓ వాదన కూడా వినిపిస్తోంది. ఇరుదేశాధినేతల భేటీ వల్ల పశ్చిమ దేశాలు అసూయపడతాయని రష్యా భావిస్తోంది.
కీలక ఒప్పందాలపై సంతకం
మోదీ - పుతిన్ సమావేశంలో చర్చించనున్న అజెండాపై రష్యా ప్రకటన చేసింది. రష్యా - భారత్ సంప్రదాయ స్నేహపూర్వక సంబంధాల బలోపేతంతో పాటు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలకు సంబంధించిన విషయాలపై చర్చిస్తారని తెలిపింది. భారత్ నుంచి దీనిపై పెద్దగా సమాచారం రాకపోయినప్పటికీ.. కొన్ని కీలక ఒప్పందాలపై ఇరుదేశాధినేతలు సంతకాలు చేసే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు.
Also read: హెచ్‌ఐవీ నివారణకు మందు .. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్
రష్యా ప్లాన్ అదేనా ?
మరో విషయం ఏంటంటే.. ప్రధాని మోదీ మాస్కోకు వెళ్లడం రష్యాకు పెద్ద అవకాశంగా చెప్పుకోవచ్చు. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు రష్యాను ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆ దేశంపై పలు ఆంక్షలను కూడా విధించాయి. ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ పర్యటన అనేది రష్యా ఒంటరిగా లేదని పశ్చిమ దేశాలకు సూచించినట్లవుతుంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. చాలా దేశాలు ఆ దేశానికే అండగా నిలుస్తున్నాయి. అయితే మోదీ పర్యటన వల్ల పశ్చిమ దేశాల ప్రణాళికలను రష్యా చెడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని కొందరు వాదిస్తున్నారు. మోదీ, పుతిన్ ఎలాంటి అంశాలపై చర్చలు జరుపుతారో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
#WATCH | Prime Minister Narendra Modi receives Guard of Honour on his arrival in Moscow, Russia
PM Modi is on a two-day official visit to Russia. He will hold the 22nd India-Russia Annual Summit with President Putin. pic.twitter.com/G4GDS3va5s
— ANI (@ANI) July 8, 2024
రష్యాకు పెద్ద అవకాశం
పశ్చిమ దేశాలు రష్యాను ఏకాకి చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. రష్యా మాత్రం తాను ఒంటరి కాదని నిరూపించుకునేందుకు యత్నిస్తోంది. కొన్నిసార్లు చైనాతో సమావేశం కావడం అలాగే వియత్నాం, ఉత్తర కొరియాను సందర్శించడం లాంటివి చేసింది. దీంతో చాలా దేశాలు తమ వెంట ఉన్నాయని రష్యా ప్రపంచానికి చెప్పాలని ప్రయత్నిస్తోంది. ఇప్పుడు మోదీ పర్యటనను కూడా రష్యా ఒక పెద్ద అవకాశంగా భావిస్తోంది.
Also Read: ఆలయం బయట రాహుల్ ఫొటోతో డోర్‌మ్యాట్.. వీడియో వైరల్
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రధాని మోదీ రష్యాకు వెళ్లడం ఇదే మొదటిసారి. 2022 ఫిబ్రవరిలో రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. రష్యాకు వ్యతిరేకంగా ఉండాలని పశ్చిమ దేశాల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ మాత్రం సైలెంట్‌గానే ఉంది. భారత్ - రష్యా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా వ్యవహరిస్తోంది. గతంలో రష్యా నుంచి చముకు కొనవద్దని పశ్చిమ దేశాలు ఆంక్షలు పెట్టినప్పటికీ.. భారత్ చమురు కొనుగోలును కొనసాగించింది. అయితే ఉక్రెయిన్ - రష్యా మధ్య శాంతి ఉండేందుకు తాము అనుకూలంగా ఉంటామని భారత్ స్పష్టం చేసింది. యుద్ధం ఆగాలంటే శాంతి చర్చలే పరిష్కారమని ప్రధాని మోదీ చాలాసార్లు పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే.