PM Modi: ఛాంపియన్లతో మోదీ చిట్ చాట్.. నవ్వులు పూయించిన వీడియో వైరల్! టీ20 ప్రపంచకప్ విజేతలతో మోదీ తన నివాసంలో సమావేశమయ్యారు. ద్రావిడ్, రోహిత్‌శర్మ టీమ్ కు అల్పాహార విందు ఇచ్చిన మోదీ.. దాదాపు 2 గంటల పాటు సరదాగా ముచ్చటించారు. ఆటగాళ్ల అనుభవాలు అడిగి తెలుసుకున్నారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 05 Jul 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Team india: టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యులతో ప్రధాని మోదీ గురువారం తన నివాసంలో సమావేశమయ్యారు. ద్రావిడ్, రోహిత్‌శర్మ టీమ్ కు అల్పాహార విందు ఇచ్చారు. దాదాపు 2 గంటల పాటు విజేతలతో ప్రధాని సరదాగా ముచ్చటించారు. ప్రపంచకప్ విజయపై వారి మధురానుభూతుల్ని అడిగి తెలుసుకున్నారు. పిచ్ పై మట్టి తిన్న రోహిత్‌ను ‘రుచి ఎలా ఉంది?’ అని అడిగిన మోదీ.. ‘మన ఛాంపియన్లతో అద్భుతమైన సమావేశం. ప్రపంచకప్ గెలిచిన టీమ్ కు ఆతిథ్యమిచ్చాను. టోర్నీలో వారి అనుభవాలపై గొప్ప సంభాషణ జరిగింది’ అంటూ మోదీ ఎక్స్‌లో పంచుకున్నారు. VIDEO | PM Modi on Thursday met the members of T20 World Cup-winning Indian cricket team at his residence, discussing their journey at the recently-concluded ICC event in USA and the Caribbean. (n/1) (Full video is available on PTI Videos - https://t.co/n147TvqRQz) (Source:… pic.twitter.com/oUr9Bovm9W — Press Trust of India (@PTI_News) July 5, 2024 ఆ ఏడు సెకన్ల టైమ్ గురించి వివరించాలని.. ఈ మేరకు ప్రపంచకప్ టోర్నీ మొత్తం విఫలమైన కోహ్లీ ఫైనల్‌లో అదరగొట్టిన తీరు గురించి అడిగిన ప్రధాని.. కోహ్లీ వివరిస్తుంటే ఆసక్తిగా విన్నారు. During his interaction with PM Modi, Virat Kohli said, "Thank you very much for calling us all here and this day will always remain in my mind because in this entire tournament, I was not able to make the contribution that I wanted to and at one time I also told Rahul bhai that I… pic.twitter.com/8AvmpSm9wd — RTV (@RTVnewsnetwork) July 5, 2024 అలాగే ఫైనల్ మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వచ్చి అదరగొట్టిన అక్షర్ పటేల్ అనుభవాలను తెలుసుకున్నారు. బౌండరీ లైన్ వద్ద మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ పట్టిన సూర్యకుమార్ యాదవ్‌ను ఆ ఏడు సెకన్ల టైమ్ గురించి వివరించాలని చెప్పారు. చివరగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా ‘నమో’ అని రాసున్న ఒకటో నంబరు జెర్సీని ప్రధానికి అందించారు. అయితే ఈ సమావేశంపై తనదైన స్టైల్ లో స్పందించిన కోహ్లీ.. ‘ప్రధాని మోదీని కలవడం గౌరవంగా ఉంది. మమ్మల్ని ఆహ్వానించి ఆభినందించినందుకు ధన్యవాదాలు సర్’ అంటూ సోషల్ మీడియా వేదికగా థాంక్స్ చెప్పాడు. The triumphant Indian Cricket Team met with the Honourable Prime Minister of India, Shri Narendra Modiji, at his official residence today upon arrival. Sir, we extend our heartfelt gratitude to you for your inspiring words and the invaluable support you have provided to… pic.twitter.com/9muKYmUVkU — BCCI (@BCCI) July 4, 2024 రిషబ్ పంత్.. ఇక రెండేళ్ళ క్రితం ఘోరమైన కారు ప్రమాదం తర్వాత ఆసుపత్రిలో చేరినప్పుడు తన తల్లికి ప్రధాని నరేంద్ర మోడీ మధ్య జరిగిన చాట్‌ను రిషబ్ పంత్ గుర్తు చేసుకున్నారు. 'నేను ఏడాదిన్నర క్రితం చాలా కష్టతరమైన దశలో ఉన్నాను. మీరు మా అమ్మకి ఫోన్ చేసి అంతా బాగానే ఉంటుందని చెప్పినట్లు గుర్తు. అప్పుడే నేను మానసికంగా కాస్త ప్రశాంతత పొందాను. ఆ తర్వాత కోలుకున్నప్పుడు నేను క్రికెట్ ఆడగలనా లేదా అని ఆందోళన చెందాను. వికెట్ కీపింగ్ ప్రధానమైన ఆందోళన కలిగించింది. నేను మళ్లీ గ్లోవ్స్ తొడగలేనని చాలా మంది సూచించారు. కానీ నేను మళ్లీ ఫీల్డ్‌కి వచ్చి గతంకంటే బాగా ఆడాలని అనుకున్నాను. నన్ను నేను నిరూపించుకుని దేశం కోసం ఆడాలని, దేశం కోసం మరోసారి మ్యాచ్‌లు గెలవాలని అనుకున్నాను' అని పంత్ అన్నాడు. During his interaction with PM Modi, rishab Pant said that "1.5 years ago I had an accident, so I was going through a very difficult phase, I remember that very well because your call came to my mother and my mother told me that Sir had said that there is no problem, then I… pic.twitter.com/q2Z1RNRPkI — RTV (@RTVnewsnetwork) July 5, 2024 హార్డిక్ పాండ్యా.. ‘సర్ మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. గత ఆరు నెలలు నా జీవితంలో చాలా వినోదాత్మకంగా గడిచాయి. ప్రతి విషయంలో ఎంతో ఉత్కంఠ నెలకొంది. కానీ నేను మైదానంలోకి వెళ్లినప్పుడల్లా నన్ను అందరూ ఉత్సాహపరిచారు. నాపై వచ్చిన విమర్శలను ఆట ద్వారానే సమాధానం చెప్పాలనుకున్నాను. చివరి ఓవర్‌లో నా ఆటను చూపించే అవకాశం వచ్చింది. సూర్య గేమ్ మార్చే క్యాచ్ పట్టాడు. కెప్టెన్, కోచ్ నుంచి నాకు చాలా మద్దతు లభించింది' అన్నాడు. హార్దిక్ వేదన విన్న ప్రధాని మోదీ నవ్వుతూ.. ‘మీ ఓవర్ హిస్టారిక్‌గా మారింది. అయితే మీరు సూర్యతో ఏం చెప్పారు?’ అని అడిగారు. ఈ ప్రశ్నకు హార్దిక్ బదులిస్తూ ‘అతను ఆ క్యాచ్ పట్టిన వెంటనే మేము సంబరాలు చేసుకోవడం ప్రారంభించాం' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా ప్రధాని నరేంద్ర మోదీతో సంభాషించిన సందర్భంగా ..సర్ మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. గత ఆరు నెలలు నా జీవితంలో చాలా వినోదాత్మకంగా గడిచాయి. ప్రతి విషయంలో ఎంతో ఉత్కంఠ నెలకొంది. కానీ నేను మైదానంలోకి వెళ్లినప్పుడల్లా నన్ను అందరూ ఉత్సాహపరిచారు. నాపై వచ్చిన విమర్శలను… pic.twitter.com/R2XGVGR3lr — RTV (@RTVnewsnetwork) July 5, 2024 అలాగే అద్భుతమైన బౌలింగ్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చిన బుమ్రాను ఫీలింగ్స్ ను ఆసక్తిగా విన్నారు. అనంతరం బుమ్రా ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు. #pm-modi #2024-t20-world-cup #india-cricket-team మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి