PM Modi: ప్రధాని నరేంద్రమోదీకి చాయ్ ఇచ్చిన రోబో..సోషల్ మీడియాలో వైరల్..! ప్రధాని నరేంద్రమోదీకి ఓ రోబో చాయ్ అందించింది. అహ్మదాబాద్‌లోని వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ గ్యాలరీని ఆయన సందర్శించారు. ఆనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను మోదీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. By Jyoshna Sappogula 27 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి PM Modi: ప్రధాని నరేంద్రమోదీకి (PM Modi) ఓ రోబో చాయ్ అందించింది. అహ్మదాబాద్‌లోని వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ గ్యాలరీ (Robotics Gallery)ని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా గ్యాలరీలో ప్రదర్శించిన ఓ రోబో ఆయనకు చాయ్ అందించింది. Exploring the endless possibilities of the future with Robotics! pic.twitter.com/DYtvZN9CLC — Narendra Modi (@narendramodi) September 27, 2023 ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ (Gujarat)లో పర్యటిస్తున్నారు. ‘వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్’ 20వ వార్షికోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ గ్యాలరీ ని ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆ గ్యాలరీలో ప్రదర్శించిన ఓ రోబో మోదీకి ఛాయ్ (Chai) ఇచ్చింది. గుజరాత్ సైన్స్ సిటీలో రోబోటిక్స్ గ్యాలరీ తనను ఎంతగానో ఆకట్టుకుందని, రోబో తమకు చాయ్ ఇచ్చిన ఫోటోను అస్సలు మిస్ కావొద్దని క్యాప్షన్ పెట్టి ఫోటోలను, వీడియోను షేర్ చేశారు. రోబోటిక్స్ గ్యాలరీలో తనకు ఓ రోబో టీ సర్వ్ చేసిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. The Shark Tunnel is an exhilarating experience showcasing a diverse array of shark species. As you walk through the tunnel, you will greatly marvel at the diversity of marine life. It is truly captivating. pic.twitter.com/n2nFm2NEOY — Narendra Modi (@narendramodi) September 27, 2023 2003లో గుజరాత్‌కు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వైబ్రంట్ గుజరాత్ తొలి సదస్సు జరిగింది. నాటి సంగతులను మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘‘ఈ తొలి సదస్సు జరిగినప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులెవరూ సమావేశాలకు రాలేదని.. నేను అభివృద్ధి గురించి ఆలోచిస్తే.. వారు రాజకీయాలు చూశారు’’ అంటూ పరోక్షంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. #pm-modi #robot #gujarath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి