Supreme court:ప్లీజ్ నన్ను మైలార్డ్ అని పిలవకండి...

మైలార్డ్, యువర్ లార్డ్ షిప్స్ అని దయచేసి నన్ను పిలవొద్దు అంటున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి. అలా అనడం ఆపేస్తే నా జీతంలో సగం మీకు ఇచ్చేస్తానంటూ వేడుకున్నారు జస్టిస్ పీఎస్ నరసింహ.

New Update
Supreme court:ప్లీజ్ నన్ను మైలార్డ్ అని పిలవకండి...

కోర్టులో హియరింగ్ జరుగతున్నప్పుడు జడ్జిని మైలార్డ్, యువర్ లార్డ్ షిప్ అని సంభోదిస్తంటారు. బ్రిటీష్ వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ పద్ధతిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు మన లాయర్లు. కానీ ఇది ఒక సుప్రీంకోర్టు జడ్జికి చాలా విసుగు కలిగించింది. అందుకే ప్లీజ్ నన్ను మూలార్డ్ అని పిలవొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు జస్టిస్ పీఎస్ నరసింహ. అలా అంటుంటే వినడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు. దానికి బదులుగా సర్ అని పిలవొచ్చు కదా అని బతిమాలుకున్నారు. ఇలా అనడం ఆపేస్తే, నా వేతనంలో సగం మీకిచ్చేస్తా అని జస్టిస్‌ పీఎస్‌ నరసింహ పేర్కొన్నారు. బుధవారం జస్టిస్‌ ఏఎస్‌ బొపన్నతో కలిసి ఆయన ఓ కేసు విచారణలో పాల్గొన్నారు.

Also Read:చంద్రబాబు మధ్యంతర బెయిల్ అదనపు షరతుల పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

మైలార్డ్, యువర్ లార్డ్ షిప్ అనేవి బ్రిటీష్ వాళ్ళు వాడే పదం. దానినఏ మన కోర్టుల్లో లాయర్లు కూడా అనుకరిస్తున్నారు. నిజానికి కోర్టు ప్రొసీడింగ్స్ సమయంలో ఆ పదాలను వాడకూడదంటూ 2006లోనే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం చేసింది. అది చేసి ఇప్పటికి ఏడేళ్ళు గడుస్తున్నా మైలార్డ్, యువర్ లార్డ్ షిప్ పదాలను వాడడం మాత్రం ఆపడం లేదు కోర్టుల్లో మన దేశ లాయర్లు.

ఇంతకు ముందు 2020లో హర్యానా కోర్టు జస్టిస్ మురళీధర్ కూడా లాయర్లను ఇలాగే కోరారు. మై లార్డ్, యువర్ లార్డ్ షిప్ పదాలను ఉపయోగించొద్దని న్యాయవాదులను అభ్యర్ధించారు. సర్" లేదా "యువర్ హానర్" అని సంబోధించమని కోరారు.

Also read:నేటి నుంచే పోస్టల్ ఓటుకు దరఖాస్తు..ఎవరెవరు చేసుకోవచ్చంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు