Telangana Politics:బీఆర్ఎస్‌లోకి పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్

పీజేఆర్ కొడుకు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి మంత్రి హరీష్ రావు వెళ్ళారు. విష్ణుని కలిసి బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. నిన్న రాత్రి విష్ణువర్ధన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.

New Update
Telangana Politics:బీఆర్ఎస్‌లోకి పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్

పీజెఆర్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ కాంగ్రెస్ మీద కోపంగా ఉన్నారు. జూబ్లీహిల్స్ టికెట్ తనకు కాకుండా అజారుద్దీన్‌కు ఇవ్వడంతో ఆయన అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విష్ణును మంత్రి హరీష్ రావు కలిశారు. అతని ఇంటికి వెళ్ళి మరీ బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. అంతకు ముందు విష్ణువర్ధన్ నిన్న రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. దీంతో విష్ణు బీఆర్ఎస్ లో చేరడం ఖాయం అయిపోయింది.

ఈరోజు మంత్రి హరీష్ రావు కలిసిన తర్వాత విష్ణు వర్ధన్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్లో ఈ పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని కామెంట్స్ చేశారు. మా నాన్న 35 ఏళ్ళు, తాను 17 ఏళ్ళు కాంగ్రెస్‌కు సేవ చేశామని...కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని అన్నారు. కాంగ్రెస్‌లో గాంధీభవన్‌ను అమ్మేసే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు విష్ణువర్ధన్. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ లో చేరుతున్నానని ప్రకటించారు.

Also read:13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్

మరోవైపు విష్ణువర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్‌లో సరైన గౌరవం కల్పిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. విష్ణుకి తమ పార్టీలో మంచి భవిష్యత్తు ఇస్తుందని అన్నారు. తెలంగాణ కోసం నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. తాను, విష్ణు ఎమ్మెల్యేలుగా ఐదేళ్ళు ఉన్నామని...ఉద్యమాల్లో కలిసి పోరాడామని హరీష్ రావు చెప్పారు.

Also read:ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి

Advertisment
Advertisment
తాజా కథనాలు