Pithapuram: కీచకుడిగా మారిన టీచర్... బుద్ధి చెప్పిన పేరెంట్స్

కాకినాడ పిఠాపురంలో ఓ కీచక టీచర్‌కి దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. బాలికలను లైంగికంగా వేధించాడని ఉపాధ్యాయుడిపై ఆరోపణలు వచ్చాయి. సోషల్ టీచర్ దుర్గారావు రెండు నెలలుగా విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విషయం బయటకు రావడంతో తల్లిదండ్రులందర అందరూ కలిసి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

New Update
Pithapuram: కీచకుడిగా మారిన టీచర్... బుద్ధి చెప్పిన పేరెంట్స్

చదువుకునే పిల్లలకు పాఠశాలలో రోజురోజుకు భద్రత కరువు అవుతుంది. విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన టీచర్లు.. కొందరు ఉపాధ్యాయులు కామాంధులుగా మారి విద్యార్థులను లైంగిక వేధింపులకు గిరి చేస్తున్నారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిచిన ఘటన ఓ స్కూల్‌ వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళ్తే... కీచక టీచర్‌కి దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. ఈ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటుచేసుకుంది. పిఠాపురం ఆదిత్యలో స్కూల్‌లో కీచక ఉపాధ్యాయుడు బాలికల పట్ల లైంగిక వేధింపులకు గుర్తిచేస్తున్నాడు. విద్యార్థినిలు మానసికంగా కుంగిపోతున్నారు. విషయం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి'చేశారు. రెండు నెలలుగా విద్యార్థినుల పట్ల ఆసభ్యంగా ప్రవర్తన, ఏడవ తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సోషల్ టీచర్ దుర్గారావు. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థిని తల్లి ప్రిన్సిపాల్, ఇతర టీచర్లకు ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం సరిగా స్పందించకపోవడంతో.. విద్యార్థిని బంధువుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. విద్యార్థిని కుటుంబసభ్యులు, బందువులు పాఠశాల దగ్గర అందోళన చేశారు.

తమ పిల్లలు పట్ల అదే ఉపాధ్యాయుడు ఆసభ్యంగా ప్రవర్తించినట్లు మరికొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి ఆరోపణలు చేశారు. విషయం తెలుసుకుని పాఠశాల దగ్గరకు చేరుకుని పిఠాపురం పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపిన్నారు. తమ ముందు విద్యార్థినుల పట్ల ఆసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురి చేసిన ఉపాధ్యాయుడిని పిలిపించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడు వచ్చే వరకూ అందోళన విరమించేది లేదని బంధువులు స్పష్టం చేశారు. ఆందోళన కొనసాగించడంతో పాఠశాల వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పాఠశాలకు ఉపాధ్యాయుడు రావడంతో బంధువులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడుకి దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. సంఘటనపై విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఆందోళన చేశారు. విద్యాబుద్ధులు చెప్పవలసిన ఉపాధ్యాయుడు ఈ విధంగా ప్రవర్తించడంపై మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులలో కలవర పడుతున్నారు.

గత నెల 30న విద్యార్థినిలు జడలు వేసుకు రాలేదని ఓ టీచర్‌ జుట్టు కత్తిరించిన ఘటన తెలిసిందే. ఇప్పుడు పిఠాపురంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేధిస్తున్నాడని ప్రిన్సిపల్‌తో సహా ఇతర టీచర్లకు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి మళ్లీ జరగకాకుండా చూడాలని విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రక్షణగా ఉండాల్సిన టీచర్లే ఇలా ఉంటే.. మా పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆ ఊరికి సచిన్ దేవుడు…ఎందుకో తెలుసా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు