Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్ రావు ఉన్నట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. ప్రభాకర్ రావు A1, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు A2, రాధాకృష్ణ A3, భుజంగరావు A4, తిరుపతన్న A5, A6లో ప్రవేట్ వ్యక్తి పేరును పోలీస్ అధికారులు చేర్చారు.

New Update
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్ రావు ఉన్నట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. ప్రభాకర్ రావు A1, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు A2, రాధాకృష్ణ A3, భుజంగరావు A4, తిరుపతన్న A5, A6లో ప్రవేట్ వ్యక్తి పేరును పోలీస్ అధికారులు చేర్చారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు విచారణలో ఒప్పుకున్నారని.. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని పోలీస్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ప్రణీత్ రావు ధ్వంసం చేసిన ట్యాపింగ్ మిషిన్స్, హార్డ్ డిస్కులను పోలీసులు రిట్రీవ్ చేసే పనిలో పడ్డారు. ఒకవేళ అవి బాగు అవుతే ఈ కేసులో మరికొన్ని కీలక విషయాలు బయటకు వస్తాయని పోలీస్ అధికారులు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉండడంతో ఈ కేసులో చాలా జాగ్రత్త హ్యాండిల్ చేస్తున్నారు పోలీసులు.

ALSO READ: మాజీ మంత్రికి అస్వస్థత

విదేశాలకు జంప్..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలను బయటపెట్టారు పోలీస్ అధికారులు. ఈ కేసు వెలుగులోకి రాగానే నిందితులు విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధా కిషన్, త్రినాథ్ రావు కి ఈ కేసులో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నైజీరియాలో కోల్ మైన్ బిజినెస్ చేస్తున్న శ్రీనాథ్ రావు నైజీరియాకు పయనం అయినట్లు తెలిపారు. అలాగే ప్రభాకర్ రావు లండన్ కు, రాధాకిషన్ అమెరికాకు పరారు అయినట్లు పోలీసులు పేర్కొన్నారు. భారతీయులు ఎవరైనా సరే ఆరు నెలలకు మించి విదేశాల్లో ఉండకూడని అన్నారు. ఒకవేళ అలా ఉంటే వారి వీసా గడువు ముగుస్తుందని పోలీస్ అధికారులు వివరించారు. ఒకవేళ వీసా పొడిగింపుకు దరఖాస్తు చేసుకుంటే లుక్ అవుట్ నోటీసుల ప్రభావం పడుతుందని తెలిపారు. లుక్ అవుట్ నోటీసులకు సమాధానం ఇవ్వకపోతే మరో దఫా ఎంబసీకి ఫిర్యాదు చేసి పాస్‌పోర్ట్, వీసా బైండోవర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని.. అప్పటికి జవాబివ్వకపోతే లీగల్ గా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు