Petrol Usage: పెట్రోల్ తెగ వాడేస్తున్నారు.. డిమాండ్ తగ్గిన డీజిల్

ఏప్రిల్ నెలలో పెట్రోల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. డీజిల్ అమ్మకాలు తగ్గాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో డీజిల్ అమ్మకాలు పెరుగుతాయి. కానీ, ఈసారి ఇది రివర్స్ అయింది. డీజిల్ అమ్మకాలు తగ్గడం మంచిదే అని నిపుణులు అంటున్నారు. డీజిల్,పెట్రోల్ అమ్మకాల వివరాలు ఆర్టికల్ లో ఉన్నాయి.

New Update
Petrol Usage: పెట్రోల్ తెగ వాడేస్తున్నారు.. డిమాండ్ తగ్గిన డీజిల్

Petrol Usage: ఏప్రిల్‌లో దేశంలో పెట్రోలు వినియోగం 12.3 శాతం పెరిగింది. అయితే ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ డీజిల్ అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీల ప్రాథమిక డేటా నుండి ఈ సమాచారం వచ్చింది. ఇంధన మార్కెట్‌లో 90 శాతం వాటాను కలిగి ఉన్న ఈ పెట్రోలియం కంపెనీల మొత్తం పెట్రోల్ అమ్మకాలు(Petrol Usage) ఏప్రిల్‌లో 29.7 లక్షల టన్నులకు పెరిగాయి.  అయితే, గత ఏడాది ఇదే కాలంలో వినియోగం 26.5 లక్షల టన్నులుగా ఉంది.

డీజిల్ డిమాండ్ ఏప్రిల్‌లో 2.3 శాతం తగ్గి 70 లక్షల టన్నులకు చేరుకోగా, మార్చిలో ఈ ఇంధనానికి డిమాండ్ 2.7 శాతం తగ్గింది. డీజిల్‌కు డిమాండ్‌లో(Petrol Usage) నిరంతర తగ్గుదల చాలా ముఖ్యమైనది ఎందుకంటే, ఈ ఇంధనం దేశంలో అత్యధికంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో డీజిల్‌తో నడిచే వాహనాలను ప్రచారానికి విరివిగా వినియోగిస్తున్నారు. 

Also Read: రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి 

అయితే, ఇటీవల పెట్రోల్ ధరలు(Petrol Usage) తగ్గడంతో పాటు, ప్రైవేట్ వాహనాల వినియోగం పెరగడంతో పెట్రోలు అమ్మకాలు పెరిగాయి. ఇదిలా ఉండగా, పంట కాలం- వేడి వేసవి కాలం రావడంతో డీజిల్ డిమాండ్ ధోరణి కూడా రివర్స్ అవుతుందని భావిస్తున్నారు. మార్చి మధ్యలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు రూ.2 చొప్పున తగ్గాయి. రెండేళ్లలో ధరల్లో మార్పు రావడం ఇదే తొలిసారి.

నెలవారీ ప్రాతిపదికన చూస్తే, పెట్రోల్ అమ్మకాలు(Petrol Usage) మార్చిలో 28.2 లక్షల టన్నులతో పోలిస్తే ఏప్రిల్‌లో 5.3 శాతం తగ్గాయి. కానీ డీజిల్ విషయానికి వస్తే, మార్చిలో 67 లక్షల టన్నుల నుండి అమ్మకాలు 4.4 శాతం పెరిగాయి. డీజిల్ భారతదేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనం. వినియోగించే మొత్తం పెట్రోలియం ఉత్పత్తులలో 40 శాతం వాటా డీజిల్ దే కావడం గమనార్హం.  దేశంలోని మొత్తం డీజిల్ విక్రయాల్లో రవాణా రంగం వాటా 70 శాతం. ఇది హార్వెస్టర్లు -ట్రాక్టర్లతో సహా వ్యవసాయ రంగాలలో ఉపయోగించే ప్రధాన ఇంధనంగా ఉంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు