Petrol Price In India:పెట్రోల్ రేటు తగ్గలేదు.. డీజిల్ ధర మారలేదు.. ఈరోజు ఎంతంటే.. క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, ఆ ప్రభావం మన దేశంలో కనిపించడం లేదు. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేయలేదు. దీంతో ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 01 Sep 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Petrol Price In India : వరుసగా పెరుగుతూ వచ్చిన క్రూడాయిల్ ధరలు ఈరోజు కాస్త తగ్గుదల కనబరిచాయి. అంతర్జాతీయంగా ఉన్న ఆర్ధిక పరిస్థితులకు తోడు.. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణంలో కాస్త శాంతించిన పరిస్థితి కనిపించడంతో క్రూడాయిల్ ధరల్లో కాస్త తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం అంటే ఈ ఉదయం (01.09.2024) 7 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 76.93 డాలర్లుగా ఉంది. WTI ముడి చమురు 73.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే ఈ ప్రభావం భారత్ లో కనిపించలేదు. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను యధాతథంగా ఉంచాయి. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. ముడి చమురు ప్రధాన దిగుమతిదారుగా, భారతదేశం పెట్రోల్, డీజిల్ ధరలు భారత్, US డాలర్ మధ్య మారకం రేటు ద్వారా ప్రభావితమవుతాయి. పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ కూడా వాటి ధరలపై ప్రభావం చూపుతుంది. ఈ ఇంధనాలకు డిమాండ్ పెరిగితే, అది అధిక ధరలకు దారితీయవచ్చు. పెట్రోలు - డీజిల్ ధర(Petrol And Diesel Rates) ముడి చమురును శుద్ధి చేయడానికి అయ్యే ఖర్చుతో ప్రభావితం అవుతుంది. శుద్ధి ప్రక్రియ ఖరీదైనది అలాగే ఉపయోగించిన ముడి చమురు రకం, రిఫైనరీ సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా శుద్ధి ఖర్చులు మారవచ్చు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు మన దేశంలో ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. స్థానికంగా ఉండే పన్నులు, రవాణా ఛార్జీలు ఆధారంగా వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉంటాయి. ఈరోజు అంటే 30.08.2024 ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72, డీజిల్ ధర రూ.87.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.44, డీజిల్ ధర రూ.89.97గా ఉంది. కోల్‌కతా (Kolkata) లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.95, డీజిల్ ధర రూ.91.76గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.75, డీజిల్ ధర రూ.92.34గా ఉంది. The Fuel Prices remains unchanged same as yesterday in different parts of the country.#Petroldieselprice #constant #Fuelprices #telangana #AndhraPradesh #delhi #RTV pic.twitter.com/A0obWPfeuO — RTV (@RTVnewsnetwork) September 1, 2024 Noida : లీటర్ పెట్రోల్ రూ. 94.83, డీజిల్ రూ. 87.96 గురుగ్రామ్: లీటర్ పెట్రోల్ రూ. 95.19, డీజిల్ రూ. 88.05. బెంగళూరు: లీటర్ పెట్రోల్ రూ.102.86, డీజిల్ రూ.88.94. చండీగఢ్: లీటర్ పెట్రోల్ రూ.94.24, డీజిల్ లీటర్ రూ.82.40, హైదరాబాద్: లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65. జైపూర్: లీటర్ పెట్రోల్ రూ.104.88, డీజిల్ రూ.90.36. పాట్నా: లీటర్ పెట్రోల్ రూ.105.18, డీజిల్ రూ.92.04. #petrol-price-today #petrol-price-in-hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి