AP: పెన్షన్ల పంపిణీలో పై నేడు హైకోర్టులో విచారణ

పెన్షన్లను పంపిణీ చేసే విషయంలో వాలంటీర్లు తప్పుకోవాలని ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పెన్షన్‌దారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పెన్షనర్లు అందులో పేర్కొన్నారు.

New Update
AP: పెన్షన్ల పంపిణీలో పై నేడు హైకోర్టులో విచారణ

AP: లోక్ సభ ఎన్నికల (Elections) సమీపిస్తున్న వేళ ఆంధ్ర ప్రదేశ్‌(AP) లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పెన్షన్లను పంపిణీ చేసే విషయంలో వాలంటీర్లు (Volunteers) తప్పుకోవాలని ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పెన్షన్‌దారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో గుంటూరుకు చెందిన ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసింది.

ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పెన్షనర్లు అందులో తెలిపారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వకపోతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. ఇక, పెన్షనర్ల పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.ఇక, ఏపీ హైకోర్టు పెన్షన్‌దారుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించే అవకాశం కనిపిస్తుంది.

ఒక వేళ ఈ పిటిషన్‌పై విచారణ జరిపితే ఎలాంటి తీర్పు ఇస్తుందోనని తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. పింఛన్ల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అందజేయడం నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లను తొలగించాలని ఈసీ ఆదేశించింది. వాలంటీర్ల తొలగింపుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. టీడీపీ వల్లే వాలంటీర్లను తొలగించారని వైసీపీ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. ఈ క్రమంలో పెన్సన్లర్లు హైకోర్టును ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also read: ఇండియన్ మైఖేల్ జాక్సన్‌ ప్రభుదేవా కి హ్యాపీ బర్త్‌ డే!

Advertisment
Advertisment
తాజా కథనాలు