'బుల్లెట్' నిందితుడికి రిమాండ్ విధించిన కోర్టు నర్సాపూర్ లో జరిగిన సీఎం కేసీఆర్ సభ ప్రాంగణంలో బుల్లెట్లతో పట్టుబడిన వ్యక్తికి కోర్టు రిమాండ్ విధించింది. అస్లం అనే వ్యక్తి తాను ఎన్సీసీ కేడెట్ గా ఉన్న సమయంలో ఆ బుల్లెట్లను అక్రమంగా తెచ్చాడని ఎస్సై శివకుమార్ తెలిపారు. By Naren Kumar 18 Nov 2023 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Telugu news సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్లతో కలకలం సృష్టించిన వ్యక్తిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. నర్సాపూర్‌లో జరిగిన సభ ప్రాంగణంలో ఓ వ్యక్తి రెండు బుల్లెట్లతో పట్టుబడిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలం చండూరుకు చెందిన అస్లం ప్రస్తుతం ఓ యూట్యూబ్ చానల్‌కు విలేఖరిగా వ్యవహరిస్తున్నాడు. ఆ క్రమంలోనే సీఎం సభ కవరేజీ కోసం నర్సాపూర్ వచ్చాడు. అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా పర్సులో రెండు బుల్లెట్లను గుర్తించారు. తాను కాలేజీలో ఉన్నప్పుడు ఎన్‌సీసీ కేడెట్‌గా ఉన్నాడని, ఆ సమయంలో ఎన్‌సీసీ ట్రైనింగ్ నుంచి అక్రమంగా రెండు 7.65ఎంఎం బుల్లెట్లు తెచ్చాడని నర్సాపూర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. #telugu-news #crime-news #telugu-latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి