DK Aruna: కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారు

సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం ప్రజల సొమ్మును దోచుకోవడంలో ఎప్పుడూ ఫిట్‌గానే ఉంటుందని, అభివృద్ధి పనులు చేయడంలో మాత్రం అన్‌ ఫిట్‌గా ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్‌ ఫిట్‌ అని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు.

New Update
CM KCR: సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలు: డీకే అరుణ సంచలన వాఖ్యలు

సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం ప్రజల సొమ్మును దోచుకోవడంలో ఎప్పుడూ ఫిట్‌గానే ఉంటుందని, అభివృద్ధి పనులు చేయడంలో మాత్రం అన్‌ ఫిట్‌గా ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్‌ ఫిట్‌ అని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. గవర్నర్ ఓ మహిళ అని కూడా చూడకుండా ముఖ్యమంత్రి కుమారుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుండటం సిగ్గుచేటన్నారు. ఆ వ్యాఖ్యలు కేసీఆర్‌ దొరతనానికి నిదర్శనమన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని దేశ, విదేశాల్లో అందరూ ప్రశంసిస్తుంటే.. అవి తెలంగాణ ప్రభుత్వానికి కన్పించడం లేదా అని అమె ప్రశ్నించారు.

140 కోట్ల మంది గొంతుకగా ఉన్న ప్రధాన మంత్రిని ప్రధాని స్థానానికి అనర్హుడని ఎలా అంటారని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే కల్వకుంట్ల కుటుంబానికి నరనరాల్లో బడుగు, బలహీన వర్గాలపై ఎంత అక్కసు ఉందో తెలంగాణ ప్రజలు గమనించాలని డీకే అరుణ సూచించారు. కేటీఆర్‌ నోటీకి వచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని, మీ అంతు చూస్తారని ఆమె హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం అవినీతికి తెరలేపింది డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన ప్రతీ పథకంలో అవినీతి ఉందని, అంతే కాకుండా దళిత బంధు, బీసీ బంధు పథకాలు అమలు పరిచే సమయంలో స్వయాన ఎమ్మెల్యేలే లబ్దిదారులతో బేరాలు ఆడుతున్నారని బీజేపీ నాయకురాలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

దళిత బంధు కావాలంటే లబ్దిదారులు వారికి వచ్చి 10 లక్షల నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు 30 శాతం డబ్బులు ఇవ్వాల్సిందేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్‌ భారీ స్థాయి అవినీతికి తెరలేపారని విమర్శించారు. అంతే కాకుండా ఇటీవల ఓపెన్ చేసిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంత అలస్యంగా ఎందుకు ప్రారంభించారో చెప్పాలన్నారు. తన బినామీ అయిన మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్టు బాధ్యతలు అప్పచెప్పిన సీఎం.. ఆ ప్రాజెక్టుకు అయిన ఖర్చు కంటే అధికంగా అతనికి ముట్ట చెప్పారని ఆరోపించారు. దీనిని కవర్ చేసుకోవడానికే ఇన్ని రోజులు ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేశారని డీకే అరుణ విమర్శించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు