Revanth Reddy: అధికారంలోకి వస్తే ఆ జిల్లాను దత్తత తీసుకుంటా.. రేవంత్ సంచలన ప్రకటన..

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. బోథ్‌లో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని.. అలాగే డిసెంబర్‌ 31లోపు బోథ్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చారు.

New Update
Telangana Election 2023:తెలంగాణలో దుమ్ములేపిన కాంగ్రెస్.. గెలుపుకు 12 ముఖ్య కారణాలివే

మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీల ప్రచారాలతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పలు చోట్ల దాడులు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక ప్రధాన పార్టీల నేతలు అధికారంలోకి తాము వస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అంటూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే... ఆదిలాబాద్‌ జిల్లాను దత్తతా తీసుకుంటానని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగలో ఆయన మాట్లాడారు. తమ పార్టీకి నష్టం ఉంటుందని తెలిసినా కూడా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ కనీసం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను కూడా పరామర్శించలేదని ఆరోపణలు చేశారు.

Also Read: రఘునందన్ ఎక్కడ? దుబ్బాక ఎందుకు దాటడం లేదు?

మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మహాలక్ష్మీ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 మాత్రమే ఉండేది. ప్రధాని మోదీ.. సీఎం కేసీఆర్‌లు కలిసి ఆ ధరను రూ.1200లకు చేశారంటూ మండిపడ్డారు. కేసీఆర్‌ వల్ల బోథ్‌ ప్రాంతానికి నీళ్లు రాలేవని విమర్శించారు. ఈ నియోజకవర్గంలో ఒక్కసారి కాంగ్రెస్‌కు ఓటువేయండని ప్రజలను అభ్యర్థించారు. కాంగ్రెస్ గెలిస్తే.. బోథ్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటానని అలాగే దానితో పాటు.. ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. డిసెంబర్ 31లోపు బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ చేస్తామన్నారు. అలాగే సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలున కచ్చితంగా అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు.

Also read: బీజేపీ ప్రచారంలో కనిపించని రాములమ్మ.. కారణమిదేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు