Pawan Kalyan : జనసేన అధినేతకు స్వల్ప అస్వస్థత! జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు.ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా ఆయన వైద్యుల ద్వారా చికిత్స పొందుతూనే శనివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. By Bhavana 01 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Janasena : పిఠాపురం(Pithapuram) నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్వల్ప అస్వస్థతకు(Sick) గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. కానీ పిఠాపురం నియోజకవర్గం ప్రచారం షెడ్యూల్ ముందుగానే ఖరారు కావడంతో ఆయన ప్రచారాన్ని ఆపడం లేదు. ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా ఆయన వైద్యుల ద్వారా చికిత్స పొందుతూనే శనివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఆదివారం ఆయన పీఠాపురం అమ్మవారిని దర్శించుకున్న తరువాత జనసేన-టీడీపీ- బీజేపీ(Janasena-TDP-BJP) నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ శ్రేణులకు పలు సూచనలు ఇచ్చారు. అత్యవసర సమావేశం కోసం ఆదివారం సాయంత్రం పవన్ హెలికాఫ్టర్ ద్వారా హైదరాబాద్(Hyderabad) కు చేరుకున్నారు. తిరిగి ఆయన సోమవారం ఉదయానికి పిఠాపురం వచ్చేస్తారు. మిగిలిన పర్యటనను పూర్తి చేస్తారని పార్టీ కార్యకర్తలు, నేతలు వివరించారు. Also Read : విధ్వంసం సృష్టిస్తున్న తుపాను.. నలుగురి మృతి.. 100 మందికి గాయాలు! #pawan-kalyan #ap #pithapuram #janasena #health-issue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి