Pawan: ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా మారింది... పవన్ సంచలన వ్యాఖ్యలు వైసీపీ పాలనలో ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ధ్వజమెత్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మైనార్టీలకు అన్యాయం జరిగితే సాటి మనిషిగా నిలబడతా అని అన్నారు. By V.J Reddy 14 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Pawan Kalyan : ఈ రోజు మంగళగిరి(Mangalagiri) పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలతో భేటీ అయ్యారు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీలో మైనార్టీ నాయకులు చేరారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) సమక్షంలో పార్టీలో సాధిక్, గరికపాటి వెంకట్ చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం దిక్కులేకుండా మారిందని అన్నారు. ఏపీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ALSO READ: విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ.. జగన్ సర్కార్ గుడ్ న్యూస్ ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జనసైనికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. వైసీపీ రౌడీలను మేం ఎదురుకుంటున్నామంటే యువతే కారణమని ఆయన అన్నారు. వైసీపీ పాలనలో ఏపీ దిక్కులేకుండా పోయిందని ధ్వజమెత్తారు. బీజేపీలో ఉండటం వల్ల రాలేకపోతున్నట్లు కొందరు చెప్పారని అన్నారు. మైనార్టీలకు అన్యాయం జరిగితే సాటి మనిషిగా నిలబడతా అని పేర్కొన్నారు పవన్. యువత, మహిళా బలం వల్లే జనసేన నిలబడగలుగుతోందని పవన్ అన్నారు. వైసీపీ పాలనలో ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ఫైర్ అయ్యారు. ముస్లింలు మైనార్టీలు కాదు మెయిన్ స్ట్రీమ్ నాయకులు అని కొనియాడారు. మైనార్టీలను ఓట్ల కోణంలో చూసే మనిషిని కాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గుడుంబా శంకర్ చిత్ర ప్రదర్శన ఆదాయం.. జనసేన పార్టీకి అందజేత అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నిర్మించిన "గుడుంబా శంకర్' సినిమా 6-రిలీజ్ ద్వారా సమకూరిన రూ.35 లక్షలను జనసేన పార్టీకి మద్దతుగా అందజేశారు. గురువారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ని కలిసి చెక్ రూపంలో ఈ సొమ్మును అందజేశారు. ALSO READ: జగన్ కు షాక్.. వైసీపీలో మొదలైన అసమ్మతి ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ... "అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో రీ రిలీజ్ అయ్యే సినిమాల నుంచి వచ్చే ఆదాయంలో సింహ భాగం జనసేన పార్టీకి మద్దతుగా ఇవ్వడం ఆనందంగా ఉంది. ఆరెంజ్ సినిమా రీ-రిలీజ్ సమయంలో రూ.1.05 కోట్లు, జల్సా సినిమాకు రీ రిలీజ్ సమయంలో కోటి రూపాయలు పార్టీకి అందించాం. ఇప్పుడు గుడుంబా శంకర్ సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో సింహభాగం రూ. 35 లక్షలు పార్టీకి మద్దతుగా అందజేశాం. అంజనా ప్రొడక్షన్ లో నిర్మాణమై రీ రిలీజ్ అవుతున్న సినిమాల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం జనసేన పార్టీకి అందించాలని గతంలో నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఈ రోజు మనోహర్ ని కలిసి రూ.35 లక్షలు చెక్ అందిందాం. పార్టీ అధ్యకులు పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి కార్యక్రమాలకు ఈ మొత్తం ఉపయోగపడుతుంది" అని అన్నారు. గుడుంబా శంకర్ చిత్ర ప్రదర్శన ఆదాయం.. జనసేన పార్టీకి అందజేత శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి చెక్ రూపంలో రూ. 35 లక్షలు అందించిన శ్రీ నాగబాబు గారు @NagaBabuOffl pic.twitter.com/dzLaTPgO0b — JanaSena Party (@JanaSenaParty) December 14, 2023 #pawan-kalyan #ap-news #janasena #mangalagiri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి