/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/varma-3.jpg)
Pawan Kalyan First Response : జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పోలింగ్(Polling) తరువాత మొదటిసారి స్పందించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు. వర్మకు, తనకు మద్దతుగా ప్రచారం చేసిన నటులకు.. పిఠాపురం(Pithapuram) ప్రజలకు, జనసైనికులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. పోటీ చేస్తున్నానని ప్రకటన చేసిన మరుక్షణం నుంచి..ఎంతో ప్రేమ చూపించి ఆదరించారన్నారు. రికార్డ్ స్థాయిలో ఓటు వేసి మీ ప్రేమను తెలిపారని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ(TDP-BJP) నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Also Read: ఏపీ ఆందోళన పరిస్థితులపై ఈసీ సంచలన నిర్ణయం.. అప్పటి వరకు కేంద్రబలగాలు రాష్ట్రంలోనే..
మరువలేనిది..
ఈ సందర్భంగానే వర్మ(Varma) కు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పాద వల్లభని ఆశీస్సులు వర్మకు ఉండాలని..ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజా శ్రేయస్సుకు పనిచేయాలని ఆశీర్వదించారు. వర్మ సహకారం మరువలేనిదన్నారు. బలమైన టీడీపీ అభ్యర్థిగా ఉన్నా ఆయన సీటు త్యాగం చేసి తన కోసం నిరంతరం పనిచేసారన్నారు. భవిష్యత్తులో ఆయన చట్టసభల్లో అడుగు పెట్టి ప్రజాసమస్యల కోసం బలంగా పనిచేస్తారని పవన్ అన్నారు. వర్మ అనుభవాన్ని వినియోగించుకుంటూ.. కలిసికట్టుగా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
ప్రియమైన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నమస్కారం, - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/36BA017Tdv
— JanaSena Party (@JanaSenaParty) May 16, 2024
వమ్ము చేయకుండా..
సినీ కుటుంబ సభ్యుల ప్రేమను కదిలించే విధంగా తన కోసం పనిచేశారన్నారు. తనకు సహకారం అందించేందుకు, సిని నటులు, బుల్లితెర నటులు గడప గడపకు వేళ్ళి తన కోసం ప్రచారం చేసారని హర్షం వ్యక్తం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఎన్నారైలు కూడా తన గెలుపు కోసం కృషి చేశారన్నారు. వాళ్ల అందరు చూపిన ప్రేమ తనను కదిలించిందన్నారు. అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తానని హామీ ఇచ్చారు.