Pawan Kalyan: నేను మంత్రిగా ఉన్నా.. ఏమీ ఇవ్వలేక పోతున్నా : పవన్ కళ్యాణ్ తాను సాంకేతిక మంత్రిగా ఉన్నా కూడా ఇస్రోకు నిధులు కేటాయించలేని పరిస్థితిలో ఉన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉండడమే ఇందుకు కారణమన్నారు. ఇస్రోకు వెళ్లడానికి సైంటిస్టులు ప్రయాణించే రోడ్లు సరిగా లేవన్నారు. త్వరలో ఆ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. By Jyoshna Sappogula 13 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Pawan Kalyan: సాంకేతిక మంత్రిగా ఉన్నా.. ఇస్రోకు (ISRO) నిధులు కేటాయించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఉన్నాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీహరికోటలో (Sriharikota) ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు రాకెట్ ప్రయోగాలు అంటే నాసా (NASA) గుర్తుకు వచ్చేదని.. కానీ, నేడు మన శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలకు భారత దేశ ఖ్యాతిని చూపించారన్నారు. ఎందరో శాస్త్రవేత్తల త్యాగ ఫలితంగా ఈ రోజు ప్రపంచ దేశాలకు మించి మన రాకెట్ ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. Also Read: దువ్వాడ వాణి 5 డిమాండ్స్ ఇవే.. ఆ కండిషన్ కు ఒప్పుకోని ఎమ్మెల్సీ! విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక గురించి ఇంకా ఎక్కువగా అవగాహన కలిగించే కార్యక్రమాలు ఇస్రో చేపట్టాలని సూచించారు. తాను చిన్నప్పుడు ఇస్రో చూడాలని కలలు కన్నానని.. 40 ఏళ్ల తర్వాత నేడు సాంకేతిక మంత్రిగా ఇస్రోలో అడుగుపెట్టానని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఎన్ని భాషలు ఉన్నా, ఎన్ని భాషలు మాట్లాడినా.. తన గుండె మాత్రం భారతీయుడి గానే ఉంటుందన్నారు. Also Read: హింసాత్మక పోర్న్ చూస్తూ ట్రైనీ డాక్టర్ మర్డర్.. పోస్ట్‌మార్టంలో భయంకర నిజాలు! ఇస్రోలో సైంటిస్టులు నిత్యం దేశం కోసం పని చూస్తుంటే వారు ప్రయాణించే రోడ్లు మాత్రం గుంతల మయంగా ఉన్నాయన్నారు. ఈ విషయంపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తో మాట్లాడినట్లు తెలిపారు. త్వరలోనే బుచ్చినాయుడు కండ్రిక నుంచి మన్నారుపోలూరు రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెడతామని అన్నారు. చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైనప్పుడు అప్పటి ఇస్రో చైర్మన్ కు ప్రధాన మోదీ ఇచ్చిన ఓదార్పు గొప్పదని కొనియాడారు. చంద్రయాన్ 2 ప్రయోగ ఓటమి నుంచి రెట్టింపు ఆత్మవిశ్వాసంతో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ప్రయోగం విజయం సాధించారని గుర్తు చేశారు. #pawan-kalyan #ap-news #isro #sriharikota మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి