Andhra Pradesh: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న చంద్రబాబు, పవన్.. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఎన్నికల్లో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వాడకూడదని ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఈసీతో సమావేశం కానున్నట్లు సమాచారం. By B Aravind 08 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఎన్నికల్లో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వాడకూడదని ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడిగా పవన్, చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. అయితే ఇప్పటికే టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై ఆ పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులను పరిష్కరించినట్లుగా ఎన్నికల కమిషన్ టీడీపీకి లేఖ రాసింది. అలాగే మరికొన్ని ఫిర్యాదులు పరిష్కరణ దశలో ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు వాలంటీర్లు అసలు ఉద్యోగులే కాదని వైసీపీ చెబుతోంది. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులని అంటోంది. ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులను వాడకూడదని ఎలా చెబుతారని వైసీపీ ప్రశ్నిస్తోంది. అయితే మంగళవారం ఉదయం చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ తర్వాత ఈసీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Also read: రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా..వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు! ఈసీకీ ఫిర్యాదు చేయాల్సిన అంశాలపై కూడా ముందుగా పవన్, చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈసీతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరోసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ.. అధికార పార్టీని గద్దె దించాలనే లక్ష్యంతో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటి చేయనున్నాయి. అయితే ఏపీ ప్రజలు ఈసారి ఎవరిని ఎన్నుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే. Also read: రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా..వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు! #pawan-kalyan #telugu-news #chandra-babu-naidu #eci మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి