Cummins : వరల్డ్ కప్ హీరోకే.. ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు!

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్‌ కమిన్స్‌ 2023 డిసెంబరు నెలకుగాను ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకున్నాడు. కెరీర్‌లో తొలిసారి ఈ అవార్డును అందుకోవడం విశేషం. కాగా ఈ అవార్డు కోసం నలుగురు పేర్లు పరిగనలోకి తీసుకోగా చివరికి కమిన్స్ ను వరించింది.

New Update
Cummins : వరల్డ్ కప్ హీరోకే.. ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు!

Pat Cummins: ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్‌ కమిన్స్‌ (Pat Cummins) మరో అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా (Australia) జట్టుకు 2023 వరల్డ్ కప్ అందించి తన పేరును క్రికెట్ చరిత్రలో లిఖించుకున్న ఆయన.. ఇప్పుడు ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు (ICC Cricketer of the Year Award) దక్కించుకున్నాడు.  ఇటీవలే పాకిస్థాన్ మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(MCG)లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్లు తీసిన కమిన్స్.. టెస్టుల్లో 250 వికెట్లు తీసిన ఏడో ఆస్ట్రేలియా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ సిరీస్‌ను 3-0 తో క్లీన్‌స్వీప్‌ చేయడంలోనూ కీలకపాత్ర పోషించిన బౌలర్.. 2023 డిసెంబరు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది అవార్డు విజేతగా నిలిచాడు.

ఇదే తొలిసారి..
తైజుల్ ఇస్లాం (బంగ్లాదేశ్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)ను వెనక్కినెట్టి కెరీర్‌లో తొలిసారి ఈ అవార్డును అందుకోవడం విశేషం. ఈ అవార్డు కోసం నలుగురు పేర్లు పరిగనలోకి తీసుకోగా చివరికి కమిన్స్ ను అవార్డు వరించింది.

ఈ అవార్డుకు ఎంపికైన నలుగురు:
విరాట్ కోహ్లీ (భారత్)
రవీంద్ర జడేజా (భారత్)
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)
ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)

ఒక క్యాలెండర్ సంవత్సరంలో అన్ని ఫార్మాట్లలో ప్రభావాన్ని చూపిన ఆటగాడికి ఈ అవార్డు ఇవ్వబడుతుంది. ఇది క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తిగత అవార్డుగా పరిగణించబడుతుంది. 2004లో క్యాలెండర్ ఇయర్ లో తొలిసారిగా ఈ అవార్డును అందించగా రాహుల్ ద్రవిడ్ గెలుచుకున్నాడు. ఇప్పటి వరకూ విరాట్ కోహ్లీ (kohli) (2017, 2018), మిచెల్ జాన్సన్ (jhonson) (2009, 2014), రికీ పాంటింగ్ (ponting) (2006, 2007) మాత్రమే క్రికెట్ చరిత్రలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ అవార్డు అందుకున్నారు.

ఇది కూడా చదవండి : Rahane: నా లక్ష్యం నెరవేరేదాకా ఆడుతూనే ఉంటా.. అజింక్య రహానె

మాస్టర్‌ మైండ్‌..
ఇక కమిన్స్ సారధ్యంలో ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (WTC) విజేతగా నిలిచింది. ఫైనల్‌లో టీమ్ఇండియాను ఓడించి తొలిసారి డబ్ల్యూటీసీ గదను అందుకుంది. ప్రపంచకప్‌లో రెండు ఓటములతో వెనకబడినట్లు కనిపించిన జట్టును వరుసగా ఏడు విజయాలతో ఫైనల్‌కు చేర్చాడు. కీలకమైన ఫైనల్‌లో వరుసగా 10 విజయాలు సాధించి జోరు మీదున్న టీమ్‌ఇండియాను తన మాస్టర్‌ మైండ్‌తో బోల్తా కొట్టించి ఆసీస్‌కు ఆరో ప్రపంచ కప్‌ టైటిల్‌ను అందించాడు. దీంతో కమిన్స్‌ జీవితంలో 2023 చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది అతడు కెప్టెన్‌గా, ఆటగాడిగా ఎన్నో ఘనతలు అందుకున్నాడు. అతడి సారథ్యంలో యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ మొదటి మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడి ఒక మ్యాచ్‌ డ్రా చేసుకుని బాగా వెనకబడిపోయింది. తర్వాత అనూహ్యంగా పుంజుకుని మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను డ్రా చేసుకున్న విషయం తెలిసిందే.

ఇదిలావుంటే.. అందరూ ఊహించినట్లే కమిన్స్‌ ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధర పలికాడు. అంచనాలకు తగ్గట్టుగానే ఫ్రాంఛైజీలు అతడిపై కోట్లు కుమ్మరించడానికి పోటీపడగా.. చివరికిసన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.20.5 కోట్లకు సొంతం చేసుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు