Indigo Flight: విమానం ఆలస్యం కావడంతో పైలట్‌పై దాడి చేసిన ప్రయాణికుడికి షాక్..

పొగమంచు కారణంగా విమానం వెళ్లడం ఆలస్యం అవుతుందని ప్రకటించిన పైలట్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేశాడు. దీంతో అతడ్ని విమానం నుంచి దించేసి భద్రతా సిబ్బందికి అప్పగించింది ఇండిగో సంస్థ. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.

New Update
Bomb Hoax in Flight: విమానంలో సీటు కింద బాంబు..ప్రయాణికుడు అరెస్టు..!!

ఈ మధ్య విమానాల్లో కూడా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల తోటీ ప్రయాణికులపై మూత్రం పోసిన ఘటనలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అలాగే ఒకరినొకరు దాడి చేసుకున్న సందర్భాలు కూడా సందర్భాలు చాలనే జరిగాయి. అయితే తాజాగా విమానంలో ఓ ప్రయాణుకుడు పైలట్‌పై దురుసుగా ప్రవర్తించాడు. తాము వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా బయలుదేరుతందని పైలట్‌ ప్రకటించడంతో అతడిపై దాడికి పాల్పడ్డాడు.

Also Read: AIతో ఈ ఏడాది 40శాతం ఉద్యోగాలు ఫసక్‌.. తేల్చేసిన IMF చీఫ్..!

ప్రయాణికుడ్ని దింపేసిన భద్రతా సిబ్బంది

ఢిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగింది. అయితే పొగమంచు కారణంగా అంతరాయం ఏర్పడటంతో.. ప్రయాణం ఆలస్యమవుతుందని పైలట్ ప్రకటించాడు. అయితే చివరి వరుసలో కూర్చోని ఉన్న ఓ ప్రయాణికుడు ఇది విని కోపంతో ఊగిపోయాడు. వెంటనే పైలట్‌ వద్దకు వచ్చి దాడి చేశాడు. అయితే ఈ ఘటనపై ఇండిగో ఆ ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ప్రయాణికుడ్ని విమానం నుంచి దించేసి భద్రతా సిబ్బందికి అప్పగించింది.

13 గంటల పాటు ఆలస్యం

అయితే ఈ విమానం దాదాపు 13 గంటలు ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానం ఆలస్యం అయితే అందులో సిబ్బంది ఏం చేస్తారంటూ నెటీజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ ఆ ప్రయాణికుడ్ని అరెస్టు చేసి 'నో ఫ్లై' లిస్టులో చేర్చాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా.. నార్త్ ఇండియాలో పొగమంచు కమ్మేసింది. దీంతో సోమవారం కూడా వందకు పైగా విమానాలు రద్దయ్యాయి.

Also Read: అక్కడికి రాముడొక్కడే కాదు.. వేలాది కోట్ల పెట్టుబడులు కూడా 

Advertisment
Advertisment
తాజా కథనాలు