Budget 2024: 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. పీఎం కిసాన్ ఎకరాకు రూ.12,000..? ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో దేశంలోని మహిళా రైతులకు కేంద్రం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ నిధులను రూ.12 వేలకు పెంచాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. By V.J Reddy 11 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Parliament Budget Sessions: మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత టర్మ్ లాస్ట్ పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి ఫిబ్రవరి 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 31వ తేదీన పార్లమెంట్ లో రాష్ట్రపతి (India President) ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి 1వ తేదీన 2024-2025కి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ALSO READ: ఆ విషయంలో విఫలమయ్యాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు! పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్... పార్లమెంట్ ఎన్నికలకు సమాయం దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లోక్ సభ ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా పెట్టుకుంది. ఈ క్రమంలో దేశ ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక పథకాలను బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మరోవైపు విపక్షాలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మణిపూర్ అంశం, దేశంలో ధరల పెరుగుదల, ఎంపీల సస్పెన్షన్, ఇటీవల పార్లమెంట్ లో జరిగిన దాడి ఇలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎకరానికి రూ.12,000.... ఈ బడ్జెట్ సమావేశాల్లో దేశంలోని రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించనున్నట్లు సమాచారం. రైతులకు ఆర్థికకంగా బలం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని (PM-Kisan Samman Nidhi) ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది మూడు విడతల్లో ఎకరాకు రూ.2,000 చొప్పున రూ.6,000 లను రైతుల ఖాతాలో చేస్తుంది. అయితే.. పీఎం కిసాన్ నిధులు కేంద్రం పెంచుతుందని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల టైం కాబట్టి కేంద్రం ఈ నిధులను పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏడాదికి ఎకరాకు రూ.6,000గా ఉన్న ఈ పథకాన్ని ఏడాదికి ఎకరాకు రూ.12 వేలకు కేంద్రం పెంచనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే దాక వేచి చూడలి. ఇది కేవలం మహిళా రైతులకు మాత్రమే అని సమాచారం. ALSO READ: ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్.. BRS కు షాక్ #bjp #pm-kisan #parliament-budget-sessions #farmer-good-news #pm-kisam-amount-increased మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి