BJP: బీజేపీ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 5 నుంచి రథయాత్ర షురూ

పార్లమెంట్ ఎన్నికలపై టీ బీజేపీ ఫోకస్ పెంచింది. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు తెలంగాణలో బీజేపీ రథయాత్ర చేపట్టనుంది. ఐదు పార్లమెంట్ క్లస్టర్స్‌ పరిధిలో రోజూ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రను నిర్వహించనుంది.

New Update
Haryana BJP: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్

Telangana BJP: తెలంగాణ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఆశించని ఫలితాలను తెచ్చుకున్న బీజేపీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) విజయం పై కసరత్తు చేస్తోంది. సమీక్షలు, సమావేశాలు యాత్రలతో జోరు పెంచింది బీజేపీ (BJP). తెలంగాణలో 16 పార్లమెంట్ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు తెలంగాణలో బీజేపీ రథయాత్ర (Ratha Yatra) చేపట్టనుంది. ఈ యాత్ర ఐదు పార్లమెంట్ క్లస్టర్స్‌ పరిధిలో.. రోజూ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగనుంది.

ఇది కూడా చదవండి: చంద్రబాబు బెయిల్ రద్దు కేసు.. విచారణ వాయిదా

పొత్తుకు నో..

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న జనసేనతో పొత్తు పెట్టుకుంది. అయితే.. ఈ పెట్టుకున్న ఈ పొత్తు తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చిన సీట్లలో జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. ఇదిలా ఉండగా.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జనసేన తో పొత్తు పెట్టుకోమని.. తాము ఒంటరిగా పోటీ చేస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

టాప్ గేర్.. అధ్యక్షుల మార్పు

తెలంగాణ బీజేపీ(Telangana BJP) లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మరికొన్ని నెలల్లో పార్లమెంట్‌ ఎన్నికల(Parliament Elections) జరగనున్న వేళ తెలంగాణలోని పలు జిల్లాల అధ్యక్షులపై వేటు పడింది. మొత్తం 12 జిల్లాల్లో అధ్యక్షుల్ని మార్చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌ రెడ్డి (Kishan Reddy). పార్టీలో తన మార్క్‌ చూపిస్తున్నారు కిషన్‌ రెడ్డి. కొత్త అధ్యక్షులకు పార్టీ ఆఫీస్‌ నుంచి ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. 

కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులు

* నిజామాబాద్ – దినేష్ కుమార్
* పెద్దపల్లి – చందుపట్ల సునీల్
* సంగారెడ్డి – గోదావరి అంజిరెడ్డి
* సిద్దిపేట – మోహన్ రెడ్డి
* యాదాద్రి – పాశం భాస్కర్
* వనపర్తి – డి నారాయణ
* వికారాబాద్ – మాధవరెడ్డి
* నల్గొండ – డాక్టర్ వర్షిత్ రెడ్డి
* ములుగు – బలరాం
* మహబూబ్ నగర్ – పీ శ్రీనివాస్ రెడ్డి
* వరంగల్ – గంట రవి
* నారాయణపేట – జలంధర్ రెడ్డి

కొత్తగా నియమితులైన 6 మోర్చాలా అధ్యక్షులు

* ఎస్టీ మోర్చా – కల్యాణ్ నాయక్
* ఎస్సీ మోర్చా – కొండేటి శ్రీధర్
* యువ మొర్చా – మహేందర్
* OBC మోర్చా – ఆనంద్ గౌడ్
* మహిళ మోర్చా – డాక్టర్ శిల్పా
* కిసాన్ మోర్చా – పెద్దోళ్ల గంగారెడ్డి

ఇది కూడా చదవండి: సీఎం జగన్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు