India vs Pakistan Asia Cup 2023 Live Score🔴: భారత్-పాక్ మ్యాచ్ రేపటికి వాయిదా ఆసియా కప్ సూపర్-4లో భాగంగా దాయాది జట్టు పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్లు అదరగొడుతున్నారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బంతులను పోటీ పోటీగా బౌండరీలకు తరలిస్తుండటంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. By Karthik 10 Sep 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఆసియా కప్ సూపర్-4లో భాగంగా దాయాదుల పోరు ప్రాంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం ఎప్పుడు పడేది తేలియడం లేదు. కానీ ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డం పడవద్దని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు దాయాదుల మధ్య జరుగుతున్న సమరంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ నిదానంగా ఆడుతున్నారు. పాక్ బౌలింగ్‌ను సమర్దవంతంగా ఎదుర్కొంటూ వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియా 8 ఓవర్లు పూర్తయ్యేలోపు50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ శర్మ (10) శుభ్ మన్‌గిల్ (39) పరుగులుతో క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లలో భారత ఓపెనర్లు 50 పరుగులే పూర్తి చేయవడంతో భారత్ బ్యాటింగ్ ఎలా సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు సెప్టెంబర్ 2 టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడింది. దాయాదుల మధ్య జరిగిన పోరులో టాప్ ఆర్డర్ విఫలమైనా మిడిలార్డ్ రాణించడంతో టీమిండియా గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ అయిపోగానే భారీ వర్షం మొదలైంది. అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అనంతరం సెప్టెంబర్ 4న నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. Sep 10, 2023 21:13 IST భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. రిజర్వ్ డేకు మారిన ఫలితం దాయాదితో జరుగుతున్న పోరులో వర్షం మరోసారి అడ్డుపడింది. మ్యాచ్ తిరిగి పారంభం అవుతుందనకున్న సమయంలో కొలంబోలో మరోసారి వర్షం ప్రారంభమవ్వడంతో మ్యాచ్ రద్దైనట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మ్యాచ్ ఫలితం రిజర్వ్ డేకు మారంది. ఇవాళ ఆట 24.1 ఓవర్ల వరకు కొనసాగగా.. రేపు రిజర్వ్ డే రోజు భారత ఇన్నింగ్స్ 24.1 ఓవర్ల నుంచి ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది. మరోవైపు ఇవాళ పాక్‌పై భారత ఓపెనర్లు ధాటిగా రాణించారు. రోహిత్, గిల్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఈ ఓపెనింగ్ జోడి పాక్‌పై 123 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ప్రస్తుతం 24.1 ఓవర్ల వరకు మ్యాచ్ కొనసాగగా.. టీమిండియా 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. Sep 10, 2023 20:33 IST తగ్గిన వర్షం మ్యాచ్‌ను కుదించిన అంపైర్లు.. ఎన్ని ఓవర్లంటే..! ఆసియా కప్‌లో భాగంగా జరుగుతున్న భారత్-పాకిస్థాన్ వన్డే మ్యాచ్‌ను అంపైర్లు కుధించారు. ఈ మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదిస్తున్నట్లు అంపైర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే 24 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. మరో 10 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. Sep 10, 2023 19:04 IST తగ్గిన వర్షం ఆసియా కప్ సూపర్-4లో భాగంగా జరుగుతున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్పించగా.. ప్రస్తుతం కొలంబోలో వర్షం తగ్గింది. దీంతో గ్రౌండ్‌లోనీ నీరు తొలగించే సిబ్బంది నిమగ్నయ్యారు. ప్రస్తుతం 24.1 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. క్రీజులో రన్ మిసన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు. Sep 10, 2023 17:03 IST మ్యాచ్‌కు వర్షం అంతరాయం ఆసియా కప్‌లో భాగంగా భారత్ పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించింది. కొలంబోలో భారీ వర్షం పడుతుండటంతో సిబ్బంది గ్రౌండ్‌ను పూర్తిగా కవర్లతో నింపారు. ప్రస్తుతం 24.1 ఓవర్లకు భారత్ 147 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు. Sep 10, 2023 16:59 IST IND vs PAK Asia Cup 2023 Live Updates 🔴: మ్యాచ్‌కు వర్షం అంతరాయం ఆసియా కప్‌లో భాగంగా భారత్ పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించింది. కొలంబోలో భారీ వర్షం పడుతుండటంతో సిబ్బంది గ్రౌండ్‌ను పూర్తిగా కవర్లతో నింపారు. ప్రస్తుతం 24.1 ఓవర్లకు భారత్ 147 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు. Sep 10, 2023 16:52 IST 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ ఓపెనర్లు ఔట్ అయిన అనంతరం గ్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ నిదానంగా రాణిస్తున్నారు. ఇరువురు ప్లేయర్లు వీలు చిక్కినప్పుడల్లా బంతులను బౌండరీకి తరలిస్తున్నారు. మరోవైపు కేఎల్ రాహుల్ 55 అంతర్జాతీయ వన్డేల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. Sep 10, 2023 16:44 IST గిల్ ఔట్ భారత్ రెండో వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఔట్ అయ్యాడు. షాహిన్ అఫ్రీదీ బౌలింగ్‌లో సల్మాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత్ 17.5 ఓవర్లలో 123 పరుగులకు ఓపెనర్ల వికెట్లు కోల్సొయింది. Sep 10, 2023 16:44 IST రోహిత్ శర్మ ఔట్ భారత ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. భారత ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. స్పిన్నర్ షాబాద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్ ఫహీమ్‌కు క్యాచ్ ఇచ్ ఇచ్చి ఫెవిలీయన్‌కు చేరుకున్నాడు. దీంతో ఓపెనర్ల 121 పరుగుల బాగస్వామ్యానికి తెరడింది. Sep 10, 2023 16:43 IST అదరగొడుతున్న భారత ఓపెనర్లు ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరితో అదరగొట్టాడు. హిట్ మ్యాన్ కేవలం 43 బంతుల్లోనే 50 పరుగులు మార్క్‌ను అందుకున్నాడు. దీంతో ఒపెనర్లు ఇద్దరూ అర్థశతకాలతో రాణిస్తున్నారు. ప్రస్తుతం భారత్ 7.8 రన్ రేట్‌తో 15 ఓవర్లలో 115 పరుగులు పూర్తి చేసింది. #pakistan #india #asia-cup #india-batting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి