Pakistan:పాకిస్తాన్‌లో సంకీర్ణం...కొత్త ప్రధానిగా షహబాజ్ షరీఫ్

పాకిస్తాన్‌లో రాజకీయాలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌(పీఎంఎల్‌–ఎన్‌), పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) ఒప్పందానికి వచ్చాయి. పాక్ కొత్త ప్రధానిగా షహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు.

New Update
Pakistan:పాకిస్తాన్‌లో సంకీర్ణం...కొత్త ప్రధానిగా షహబాజ్ షరీఫ్

Hung Government Established in pakistan: పాకిస్తాన్లో రాజకీయాలు ఓ గాడిన పడ్డాయి. ఎన్నికల అయిన తర్వాత నుంచి ఆ దేశంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో తెలియలేదు. రోజుకో వార్తతో హడావుడి జరిగింది. ఫైనల్‌గా ఇప్పుడు పాక్‌లో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని అక్కడి పార్టీలు పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌(పీఎంఎల్‌–ఎన్‌), పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) నిర్ణయానికి వచ్చాయి. రెండు పార్టీల మధ్య నిన్న జరిగిన కీలక చర్చల తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నాయి. మీటింగ్ తర్వాత పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో... పాకిస్తాన్ నూతన ప్రధానిగా షహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా అసిఫ్ అలీలు బాధ్యతలు స్వీకరించనున్నారని ప్రకటించారు. అలాగే ఇరు పార్టీల ఒప్పందం ప్రకారం జాతీయ అసెంబ్లీలో స్పీకర్‌ పదవికి పీఎంఎల్‌–ఎన్‌ పార్టికి, డిప్యూటీ స్పీకర్‌ పదవి పీపీపీకి, సెనేట్‌లో చైర్మెన్‌ పదవి పీపీపీకి లభించనుంది.

అయితే అంతకు ముందు ప్రధానమంత్రి ఎవరూ అనేదానిపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లో అక్కడి సైన్యం రాజకీయాలను శాసిస్తుందనేది అందరికీ తెలిసిందే. నాలుగోసారి ప్రధాని కావాలని కలలు గన్న నవాజ్‌ షరీఫ్‌ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. దీంతో ప్రధాని పదవికి తన సోదరుడు షహబాజ్‌ షరీఫ్‌ను నామినేట్ చేశారు. అయితే ఈ నిర్ణయం వెనుక పాకిస్థాన్‌ ఆర్మీ హస్తం ఉన్నట్లు తెలిసింది. నవాజ్‌ షరీఫ్‌.. తమ కూతురు అలాగే రాజకీయ భవిష్యత్తు కోసమే ఆర్మీకి తలొగ్గినట్లు సమాచారం.

వాస్తవానికి పాకిస్థాన్ ముస్లిం లీగ్‌- నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించేది నవాజ్‌ షరిఫే. కానీ ఈ ఎన్నికల్లో PML-N పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకోకపోవడంతో.. పాక్‌ ఆర్మీ నవాజ్‌కు కొన్ని షరతులు పెట్టింది. ప్రధానమంత్రి పదవి కావాలా ? లేదా కుమార్తె పంజాబ్‌ సీఎం కావాలా ? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలని ఆయనకు ఆదేశించింది. ఒకవేళ ప్రధాని పదవి ఎంచుకుంటే పంజాబ్‌ సీఎం పగ్గాలు షహబాజ్‌కు ఇవ్వాలని చెప్పింది. దీంతో కూతురు భవిష్యత్తు కోసం నవాజ్‌ ప్రధాని రేసు నుంచి తప్పుకున్నట్లు PML-N పార్టీ నేత ఒకరు తెలిపారు.

ఇక కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక అయిన అసిఫ్ అలీ జర్దారీ 2008 నుంచ 2013 వరకు పాకిస్తాన్ దాకా పాక్ అధ్యక్షుడిగా పని చేశారు. ఇప్పుడు మరోసారి అదే పదవిని అసిఫ్ చేపట్టనున్నారు. మరోవైపు షహబాజ్ షరీఫ్‌ కూడా ఇంతకు ముందు ప్రధానిగా సేవలు అందించారు.

Also Read:Telangana: ఆమె కుటుంబానికి న్యాయం జరగాలి..జాహ్నవి కేసు మీద స్పందించిన కేటీఆర్

Advertisment
Advertisment
తాజా కథనాలు